Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్​ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్​లో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇందులో కేసీఆర్ మంత్రులతో కలిసి చర్చిస్తారు. ఈ నెల 14 లోపు అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నెల 6 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి.

Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్​లో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇందులో కేసీఆర్ మంత్రులతో కలిసి చర్చిస్తారు. ఈ నెల 14 లోపు అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నెల 6 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి.

ఇందులో చర్చించాల్సిన అంశాలతో పాటు టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై కేసీఆర్ చర్చిస్తారు. తెలంగాణ విషయంలో కేంద్ర సర్కారు ధోరణిపై, ఎన్డీఏ తీరును ఎండగట్టాల్సిన తీరుపై ఆయన చర్చించే అవకాశం ఉంది. తెలంగాణకు రావాల్సిన నిధులు, విద్యుత్ బకాయిల విషయంలోనూ చర్చిస్తారు. భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రం కలిసి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ వజ్రోత్సవాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

దీనిపై కూడా మంత్రులతో కేసీఆర్ చర్చిస్తారు. ఇవేగాక, ప్రభుత్వ ఉద్యోగులకు అందించాల్సిన డీఏలపై చర్చించే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో పోడు భూముల సమస్యల పరిష్కారం, రెవెన్యూ శాఖకు భూ కేటాయింపులు వంటి అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

India exercising with Russia: అమెరికా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ రష్యా చేపట్టిన విన్యాసాల్లో పాల్గొన్న భారత్

ట్రెండింగ్ వార్తలు