BRS office in Delhi: కేసీఆర్ గురువారం ఢిల్లీలో ప్రారంభించనున్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం విశేషాలు ఏంటో తెలుసా?

దక్షిణాది నుంచి ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న రెండవ పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. కాగా, ఇప్పటి వరకు తమిళనాడుకు చెందిన డీఎంకేకు మాత్రమే ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉంది. పార్టీ కార్యాలయ నిర్మాణానికి 20 నెలల సమయం పట్టింది

BRS office in Delhi

BRS office in Delhi: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అనే పేరుతో జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం.. దేశ రాజధాని ఢిల్లీలో కార్యాలయం నిర్మించారు. కాగా, ఈ కార్యాలయం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. గురువారం ఉదయమే వాస్తు పూజతో పాటు సుదర్శన హోమం చేసి, మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్ఎస్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ హాజరుకానున్నారట. దక్షిణాది నుంచి ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న రెండవ పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. కాగా, ఇప్పటి వరకు తమిళనాడుకు చెందిన డీఎంకేకు మాత్రమే ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉంది. పార్టీ కార్యాలయ నిర్మాణానికి 20 నెలల సమయం పట్టింది. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించినా ఢిల్లీలో కాలుష్యం కారణంగా నిర్మాణ పనులపై ప్రభుత్వం ఆంక్షలతో నిర్మాణం ఆలస్యమైంది. ఎడమ వైపు వైపు సమాజ్ వాదీ పార్టీ కార్యాలయం, కుడి వైపు జేడీయూ పార్టీ కార్యాలయం, మధ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది.

బీఆర్ఎస్ భవన్ విశేషాలు
* 1,300 గజాల్లో ఉన్న స్థలంలో 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవన నిర్మాణం
* 2021 సెప్టెంబర్ 2 వతేదీన టిఆర్ఎస్ భవన్ కు భూమి పూజ చేసిన కేసీఆర్
* దీనిని ఎండిపి ఇన్ఫ్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది
* మూడు అంతస్థుల్లో భవన నిర్మాణం
* లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండవ, 3వ అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులు
* లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‭లో మీడియా హాలుతో పాటు రెండు గదులు
* లోయర్ గ్రౌండ్లోకి వచ్చే మీడియాకు వీలుగా ఉండేలా ప్రత్యేక ఎంట్రెన్స్ ఏర్పాటు
* గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్తలు, నాయకుల కోసం క్యాంటీన్ ఏర్పాటు
* మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాల్
* 2,3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందుకు 20 గదులు, ఇందులో రెండు ప్రత్యేక సూట్ రూమ్స్

* పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి సూట్ రూంలలోనే బస