TS మున్సి పోల్స్ : ప్రచారం 6 రోజులు మాత్రమే

  • Publish Date - December 24, 2019 / 10:11 AM IST

కొత్త ఏడాదిలో మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరబోతున్నాయి. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. కానీ…అభ్యర్థుల ప్రచార సమయాన్ని చాలా తగ్గించారు. కేవలం 06 రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశమిచ్చారు.

రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు బహిరంగ ప్రచారం చేసుకొనేందుకు అనుమతి ఉంది. తర్వాత ప్రచారం చేస్తే అభ్యర్థులపై కేసు నమోదు చేస్తారు. జనవరి 22న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్‌ జరుగుతుంది. అనివార్య కారణాలతో పోలింగ్‌ రద్దయినా… వాయిదాపడినా 24న రీ పోలింగ్‌ నిర్వహించనున్నారు. జనవరి 25న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

* 120 మున్సిపాలిటీల్లోని 2 వేల 727 వార్డులు, 10 కార్పొరేషన్లలోని 385 వార్డులకు జనవరి 22న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 
* జనవరి 7న రాష్ట్రస్థాయిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

* మరుసటి రోజు అంటే జనవరి 8వ తేదీన జిల్లా, మున్సిపాలిటీల్లో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. 
* డిసెంబర్ 08వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
 

అయితే..రాష్ట్రఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను మరింత కుదించడం గమనార్హం. నోటిఫికేషన్‌ వెలువడిన 20 రోజుల్లోపే ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. 
పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన TSEC.. పురపోరు వ్యవధిని మరింత తగ్గించింది.

* నామినేషన్ల స్వీకరణను 03 రోజులకే పరిమితం చేసింది.
* జనవరి 8న ఉదయం 10.30 గంటలకు మున్సిపాలిటీల్లో రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇస్తారు.

* నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు.
* జనవరి 10వ తేదీ సాయంత్రం 5 గంటలవరకు స్వీకరిస్తారు.
 

* వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను వచ్చేనెల 8వ తేదీనే విడుదల చేస్తారు. 
* అభ్యర్థుల జాబితాను పరిశీలించడంతో పాటు ప్రతిపాదకులు, బలపర్చే అభ్యర్థుల ఓట్లను సరిచూసుకుని నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.
 

Read More : కొరఢా : సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై GST దాడులు

ట్రెండింగ్ వార్తలు