సెల్ ఫోన్ మాట్లాడుతూ..బస్సును నడిపిన తాత్కాలిక డ్రైవర్

  • Publish Date - November 20, 2019 / 04:50 AM IST

తాత్కాలిక డ్రైవర్ల చేతుల్లో ఆర్టీసీ బస్సులు పట్టు తప్పుతున్నాయి. వారి అజాగ్రత్తతో అదుపు కోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డుకు అడ్డదిడ్డంగా దూసుకెళుతూ నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా ఓ డ్రైవర్ సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ…డ్రైవింగ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
తాత్కాలిక డ్రైవర్లకు పెద్దగా అనుభవం లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి.

డ్రైవింగ్‌ చేస్తూ ఫోన్‌లో మాట్లాడుతుండడం ఒక కారణం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి ప్రారంభమైన ఓ బస్సులో డ్రైవర్‌ .. డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. దాదాపు రెండు నిమిషాల పాటు తాత్కాలిక డ్రైవర్‌ ఫోన్‌లో మాట్లాడాడు. ఈ వ్యవహారాన్ని ఓ వ్యక్తి వీడియో తీస్తుండడం గమనించి.. వీడియో ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించాడు. కానీ ఫోన్‌ మాట్లాడటం మాత్రం అతడు ఆపలేదు. దీంతో డ్రైవర్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. తాత్కాలికంగా డ్రైవర్లను, కండక్టర్లను నియమించింది. డ్రైవర్‌కు రూ. 2 వేలు, కండక్టర్‌కు రూ. 1500 ఇస్తూ బస్సులను తిప్పుతోంది. 
Read More : పెరుగుతున్న చలి : షిరిడీకి విమానాలు రద్దు