Dussehra rally: పంతం నెగ్గించుకున్న ఉద్ధవ్.. షిండే వర్గానికి హైకోర్టు షాక్

ఈ సభ నిర్వహణకు అంతకుముందు బృహన్ముంబై నగర పాలక సంస్థ అనుమతిని నిరాకరించింది. బీఎంసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఆర్‌డీ ధనూకా, జస్టిస్ కమల్ ఖాటా డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. బీఎంసీ ఆదేశాలు న్యాయ ప్రక్రియకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. అక్టోబరు 2 నుంచి 6 వరకు శివాజీ పార్కును ఉపయోగించుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని షరతు విధించింది.

Dussehra rally: ముంబైలోని శివాజీ పార్కులో దసరా ర్యాలీ కోసం ఉద్ధవ్, షిండే వర్గాలు కొద్ది రోజులుగా పోటాపోటీగా తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‭ను (బీఎంసీ) సంప్రదించగా.. ఇరు వర్గాలకు అనుమతి నిరాకరించారు. దీంతో ఇరు వర్గాలు బాంబే హైకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, షిండే వర్గానికి హైకోర్టు షాకిస్తూ.. శివాజీ పార్కులో ర్యాలీ నిర్వహణకు ఉద్ధవ్ వర్గానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయమై ఇరు వర్గాలు తీవ్రంగా శ్రమించాయి. ఒక రకంగా ఇరు వర్గాల మధ్య ఇది పరువు సమస్యకు దారి తీసింది. అయితే ఎట్టకేలకు హైకోర్టు అనుమతితో ఉద్ధవ్ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లైంది.

శివసేన ఆవిర్భవించిన 1966 నాటి నుంచి ప్రతి ఏటా ముంబైలోని శివాజీ మహారాజ్ పార్క్‌లో దసరా వేడుకలను శివసేన పార్టీ నిర్వహిస్తున్నది. అయితే కరోనా వల్ల గత రెండేళ్లుగా దసరా ఉత్సవాలు నిర్వహించలేదు. మరోవైపు శివసేనలో చీలిక వల్ల ఈ ఏడాది శివాజీ పార్క్‌లో దసరా బహిరంగ సభ నిర్వాహణకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఉద్ధవ్‌ ఠాక్రేకు అనుకూలంగా బాంబే హైకోర్టు స్పందించింది. మరోవైపు సీఎం షిండే నేతృత్వంలోని శివసేన రెబల్‌ వర్గం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్‌లో దసరా వేడుకలకు ఇప్పటికే బీఎంసీ నుంచి అనుమతి పొందింది.

ఈ సభ నిర్వహణకు అంతకుముందు బృహన్ముంబై నగర పాలక సంస్థ అనుమతిని నిరాకరించింది. బీఎంసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఆర్‌డీ ధనూకా, జస్టిస్ కమల్ ఖాటా డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. బీఎంసీ ఆదేశాలు న్యాయ ప్రక్రియకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. అక్టోబరు 2 నుంచి 6 వరకు శివాజీ పార్కును ఉపయోగించుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని షరతు విధించింది.

Madurai: ఎయిమ్స్ పనులు 95% పూర్తయ్యాయన్న జేపీ నడ్డా.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన కాంగ్రెస్ నేత

ట్రెండింగ్ వార్తలు