Upcoming polls will be my last election, says former Karnataka CM Siddaramaiah
Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. కర్ణాటక రాష్ట్రానికి ఈ ఏడాది చివర్లో జరగబోయే ఎన్నికలే తనకు చివరివని ఆదివారం ఆయన ప్రకటించారు. అయితే రాజకీయాల్లోంచి తాను రిటైర్ కావడం లేదని చెప్పడం గమనార్హం. బహుశా.. కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం అధికార భారతీయ జనతా పార్టీ చేస్తున్న విమర్శలకు ఆయన చెప్పిన సమాధానం కాబోలు. అంటే, ఈ ఎన్నికల అనంతరం అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి సిద్ధారమయ్య తప్పుకోవడంతో పాటు సీఎం పోటీ నుంచి తప్పుకుంటాననే అర్థంలో అలా చెప్పి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు.
BRS in Nanded: గులాబీమయమైన నాందేడ్.. 75 ఏళ్ల పాలనపై కేసీఆర్ విమర్శలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది మేలోపే జరగాల్సింది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి మే 24వ తేదీతో ముగియనుంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ఎన్నికలు 5 నుంచి 6 నెలలు ఆలస్యంగా జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగాయి. ఆ ఎన్నికల అనంతరం జనతాదళ్ సెక్యులర్, కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కూటమి విభేదాలతో పాటు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా కుమారస్వామి ప్రభుత్వం పడిపోయింది. యడియూరప్ప నాయకత్వంలో కొత్త ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసినప్పటికీ, కొద్ది కాలానికే బసవరాజ్ బొమ్మైతో ముఖ్యమంత్రిని భర్తీ చేసింది బీజేపీ అధిష్టానం.
Governor Tamilisai Delhi : ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై.. కేంద్రం దృష్టికి రాష్ట్ర పరిస్థితులు!