×
Ad

షర్మిలకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది, వైఎస్ పోలికలు కనిపిస్తున్నాయి- ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలను ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయించుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు నడిచాయని మండిపడ్డారు.

  • Published On : January 25, 2024 / 05:13 PM IST

Vundavalli Arun Kumar Key Comments On YS Sharmila Reddy

Vundavalli Arun Kumar : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలలో ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలికలు కనిపిస్తున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. షర్మిలకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని చెప్పారాయన. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ ను షర్మిల కలిశారు. అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. షర్మిల, నేను రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడుకోలేదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.

Also Read : వైఎస్ షర్మిలపై సజ్జల ఆసక్తికర కామెంట్స్

రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడాల్సిన అవసరం ఉందని చెప్పారాయన. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలను ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయించుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు నడిచాయని మండిపడ్డారు.

ఉండవల్లి అరుణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చానని షర్మిల తెలిపారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కుటుంబసభ్యులకు, తన కుటుంబసభ్యులకు సాన్నిహిత్యం ఉందని వెల్లడించారు షర్మిల.

Also Read : సీఎం అయ్యాక జగనన్న మారిపోయాడు.. అందరినీ దూరం చేసుకున్నాడు: వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నివాసానికి వెళ్లారు. ఉండవల్లితో ఆమె సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఉండవల్లితో షర్మిల చర్చించారు. షర్మిలతో పాటు మాజీమంత్రి రఘువీరారెడ్డి, పళ్లం రాజు, గిడుగు రుద్రరాజు కూడా ఉన్నారు. ఉండవల్లి కుటుంబంతో వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉందని షర్మిల చెప్పారు. మర్యాదపూర్వకంగానే కలిసేందుకు ఉండవల్లి నివాసానికి వచ్చానని తెలిపారు. కాగా, ఈ భేటీలో షర్మిలతో రాజకీయాల గురించి పెద్దగా చర్చించలేదని ఉండవల్లి వెల్లడించారు.