Sajjala Ramakrishna Reddy: వైఎస్ షర్మిలపై సజ్జల ఆసక్తికర కామెంట్స్

వైఎస్సార్ బిడ్డ, జగన్ చెల్లులు అనే అర్హతతోనే షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి పదవి వచ్చిందని అన్నారు.

Sajjala Ramakrishna Reddy: వైఎస్ షర్మిలపై సజ్జల ఆసక్తికర కామెంట్స్

Sajjala Ramakrishna Reddy

Updated On : January 25, 2024 / 3:41 PM IST

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. వైఎస్ జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని, వాటిని తట్టుకుని జగన్ ఎదిగారని చెప్పారు.

షర్మిలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నుంచి స్క్రిప్ట్ వస్తోందని షర్మిల ఆరోపించారు. షర్మిల పచ్చి అసత్యాలు చెబుతున్నారని అన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన కొనసాగుతోందని తెలిపారు. వైఎస్సార్ బిడ్డ, జగన్ చెల్లులు అనే అర్హతతోనే షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి పదవి వచ్చిందని అన్నారు.

తెలంగాణలో ఆమె పార్టీ పెడితే శుభాకాంక్షలు తెలిపామని అన్నారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ తరఫున షర్మిల ఎందుకు ప్రచారం చెయ్యలేదని ప్రశ్నించారు.

షర్మిల అప్పట్లో ఏం ఆశించి వైసీపీ కోసం పని చేశారని సజ్జల నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అపాలని ముందు తామే చెప్పామని అన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి రావాలని, వైసీపీ ఓట్లు షర్మిలకు వెళ్లాలని చంద్రబాబు ప్లాన్ వేశారని ఆరోపించారు. అందుకోసమే షర్మిలను తీసుకుని వచ్చారని చెప్పారు. చంద్రబాబు ఆటలో షర్మిల చిన్న పావు అని వ్యాఖ్యానించారు.