Ban On Popular Front of India: ఆర్ఎస్ఎస్‌పై కూడా నిషేధం విధించాలి: కాంగ్రెస్ డిమాండ్

‘‘ఆర్ఎస్ఎస్ పై కూడా నిషేధం విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మతకలహాలకు అడ్డుకట్ట వేసే విషయంలో పీఎఫ్ఐపై మాత్రమే నిషేధం విధించడం పరిష్కార మార్గం కాదు. ఆర్ఎస్ఎస్ కూడా దేశంలో హిందూ మతతత్వాన్ని వ్యాపింపజేస్తోంది. ఆర్ఎస్ఎస్-పీఎఫ్ఐ రెండూ ఒకే విధమైన సంస్థలు. కాబట్టి రెండింటిపైనా ప్రభుత్వం నిషేధం విధించాలి’’ అని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ చీఫ్ విఫ్ కొడికున్నిల్ సురేశ్ అన్నారు.

Ban On Popular Front of India: పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా (పీఎఫ్ఐ)తో పాటు దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వ ఐదేళ్ల నిషేధం విధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అయితే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కూడా నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. ‘‘ఆర్ఎస్ఎస్ పై కూడా నిషేధం విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మతకలహాలకు అడ్డుకట్ట వేసే విషయంలో పీఎఫ్ఐపై మాత్రమే నిషేధం విధించడం పరిష్కార మార్గం కాదు. ఆర్ఎస్ఎస్ కూడా దేశంలో హిందూ మతతత్వాన్ని వ్యాపింపజేస్తోంది. ఆర్ఎస్ఎస్-పీఎఫ్ఐ రెండూ ఒకే విధమైన సంస్థలు. కాబట్టి రెండింటిపైనా ప్రభుత్వం నిషేధం విధించాలి’’ అని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ చీఫ్ విఫ్ కొడికున్నిల్ సురేశ్ అన్నారు.

కాగా, పీఎఫ్ఐపై నిషేధం విధించడం పట్ల మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే హర్షం వ్యక్తం చేశారు. ‘‘పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పీఎఫ్ఐ నినాదాలు చేసింది. దీనిపై హోం శాఖ చర్యలు తీసుకుంటుంది. పీఎఫ్ఐని నిషేధించి కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. మనది దేశభక్తితో నిండిన ప్రజలు ఉన్న దేశం. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, చట్టాలను విఘాతం కలిగించేలా పీఎఫ్ఐ కార్యకలాపాలు కొనసాగించింది’’ అని ఆయన అన్నారు.

కాగా, పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా (పీఎఫ్ఐ)తో పాటు దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వ ఐదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. పీఎఫ్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

Rain alert for Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

ట్రెండింగ్ వార్తలు