వైఎస్ షర్మిల స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి? కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చినట్టేనా?

నామమాత్రపు ఓట్లతో ప్రస్తుతం ఉందో లేదో తెలియని ఏపీ కాంగ్రెస్ కు షర్మిల రూపంలో వచ్చిన టానిక్ తో ఎన్ని ఓట్లు వస్తాయో? ఏ మేరకు ఆ పార్టీ బలం పుంజుకుంటుందో? ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పటికీ.. షర్మిల వాయిస్ ను మాత్రం విస్మరించలేని పరిస్థితి వచ్చింది.

Strong Points Of YS Sharmila Reddy

YS Sharmila Plus Points : ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఉనికి కోల్పోయి పూర్తి నిస్తేజంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ కు ఇన్నాళ్లకు ఒక వాయిస్ వచ్చింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే షర్మిల ప్రత్యర్థి పార్టీలపై విమర్శల జడివాన కురిపించిన తీరు, అన్న అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి జగన్ పై ఎదురుదాడి చేసిన వైనం చూస్తే.. షర్మిల రూపంలో కాంగ్రెస్‌కు గట్టి వాయిస్ లభించినట్లు అయ్యింది.

Also Read : ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే నన్ను విమర్శిస్తారు- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పలువురు సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ.. వారికి జనంలో మాస్ అప్పీల్ లేదనే చెప్పాలి. షర్మిల రాకతో ఈ లోటు తీరుతుందనే అనిపిస్తోంది అన్నది పరిశీలకుల అభిప్రాయం. నామమాత్రపు ఓట్లతో ప్రస్తుతం ఉందో లేదో తెలియని ఏపీ కాంగ్రెస్ కు షర్మిల రూపంలో వచ్చిన టానిక్ తో ఎన్ని ఓట్లు వస్తాయో? ఏ మేరకు ఆ పార్టీ బలం పుంజుకుంటుందో? ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పటికీ.. షర్మిల వాయిస్ ను మాత్రం విస్మరించలేని పరిస్థితి వచ్చింది. ఓవరాల్ గా వైఎస్ షర్మిలకు సంబంధించి కొన్ని ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. ఆ ప్లస్ పాయింట్లపై 10టీవీ విశ్లేషణ..

వైఎస్ షర్మిల ప్లస్ పాయింట్స్..
1. మాస్ అప్పీల్ ఉన్న లీడర్
2. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు కావడం
3. వాగ్దాటితో ఎవరినైనా ఎండగట్టే నైజం
4. పట్టువీడని మొండితనం
5. ఏపీలో గణనీయంగా ఉన్న క్రిస్టియన్ మైనారిటీ వర్గాలతో అనుబంధం
6. కాంగ్రెస్ పార్టీ ప్లాట్‌ఫామ్

 

ట్రెండింగ్ వార్తలు