టెన్షన్‌లో టీడీపీ సీనియర్లు, సీటుపై క్లారిటీ ఇవ్వని చంద్రబాబు.. కారణం అదేనా?

అందులో భాగంగానే సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారని తెలుస్తోంది. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. టికెట్ దక్కని సీనియర్లను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు.

TDP Leaders : ఏపీ టీడీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. తొలి జాబితాలో పేర్లు లేని వాళ్లు, టికెట్లు దక్కని వారు చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు. ఒకవైపు చేరికలు, మరోవైపు అలకలు, బుజ్జగింపులతో చంద్రబాబు నివాసం వద్ద గందరగోళం కనిపిస్తోంది. ఇవాళ కూడా పలువురు సీనియర్లు చంద్రబాబు నివాసానికి వచ్చారు. అయితే సీటుపై చంద్రబాబు వారికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. దీంతో టికెట్ దక్కుతుందా? లేదా? అని టెన్షన్ పడుతున్నారు సీనియర్ నాయకులు.

పెనుగొండ టికెట్ ఆశించి భంగపడ్డ బీకే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. చంద్రబాబుని కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు కిష్టప్ప. నాలుగేళ్లలో తాను చేసిన సేవలను చంద్రబాబుకి వివరించారు పార్థసారథి. వైసీపీ పాలనలో పడిన ఇబ్బందులను ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తాను ఎన్నడూ కూడా పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తిని కాదని ఆయన చంద్రబాబుతో చెప్పారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల కురబల్లో అసంతృప్తి వస్తోందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పరిస్థితులను అర్థం చేసుకోవాలని పార్థసారథికి సూచించిన చంద్రబాబు.. అనంతపురం లోక్ సభ నుంచి పోటీ చేయాలని ఆయనతో చెప్పారట. అనంతపురం లోక్ సభ నుంచి మీరు కచ్చితంగా గెలుస్తారని పార్థసారథితో చెప్పారు చంద్రబాబు.

టీడీపీ మొదటి జాబితా తర్వాత కొంత అసంతృప్తి కనిపించింది. పలువురు సీనియర్ నేతలను చంద్రబాబు పక్కన పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. 83 నుంచి కూడా టీడీపీలో ఉన్న సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారు. మొదటి జాబితాలో వారికి ఎవరికీ స్థానం దక్కలేదు. రెండో జాబితాలో అయినా తమ పేర్లు ఉంటాయని సీనియర్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాబిన్ శర్మ ఇచ్చిన నివేదికల ఆధారంగానే టికెట్ల విషయంలో ఈసారి చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారని తెలుస్తోంది. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. టికెట్ దక్కని సీనియర్లను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. వారిని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. వారి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు.

టికెట్ దక్కని సీనియర్లు
టీడీపీ సీనియర్లు అందరిలోనూ టికెట్ల టెన్షన్
సీనియర్లను టెన్షన్ పెడుతున్న ఐవీఆర్ఎస్ సర్వే
దేవినేని ఉమ, యరపతినేని, చింతమనేనికి ప్రత్యామ్నాయంగా సర్వేలు
గురజాలలో జంగా కృష్ణమూర్తి పేరుతో సర్వే
కళా వెంకట్రావు- ఎచ్చెర్ల (ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నారు)
గోరంట్ల బుచ్చయ్య చౌదరి (ఎన్టీఆర్ శిష్యుడిగా ఉన్నారు, టికెట్ పై లేని క్లారిటీ, రాజమండ్రి రూరల్ స్థానం కేటాయిస్తానని హామీ)
చింతమనేని ప్రభాకర్- దెందులూరు (ఫైర్ బ్రాండ్ లీడర్, సీటుపై లేని క్లారిటీ)
దేవినేని ఉమా
పీలా గోవింద్‌- అనకాపల్లి టికెట్ ఆశించారు(ఐదేళ్ల పాటు కష్టపడి నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చానని ఆవేదన, జనసేన అభ్యర్థి కొణతాలకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్న)
యరపతినేని శ్రీనివాసరావు
బండారు సత్యనారాయణ మూర్తి- పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు
గంటా శ్రీనివాసరావు- చీపురుపల్లి వెళ్లాలని గంటాకు సూచన(భీమిలి నుంచి పోటీ చేస్తానంటున్న గంటా)
జవహర్‌ – కొవ్వూరు టికెట్ కోసం తంటాలు
బీకే పార్థసారథి – పెనుగొండ ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టు, అనంతపురం ఎంపీగా పోటీ చేయాలంటున్న చంద్రబాబు (83 నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీ సీనియర్ నేత, కురబ సామాజికవర్గం, పెనుగొండ ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టు)
గన్ని వీరాంజనేయులు – ఉంగటూరు టికెట్ ఆశిస్తున్నారు
చంద్రబాబును కలిసిన నిమ్మల కిష్టప్ప, పోటీ చేసే అవకాశం ఇవ్వాలని విన్నపం

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

 

ట్రెండింగ్ వార్తలు