Who is Giddaluru YCP Candidate
Giddaluru YCP Candidate : గిద్దలూరు వైసీపీ అభ్యర్థి పంచాయితీ హైదరాబాద్ కు చేరుకుంది. అభ్యర్థిని ఫైనల్ చేసే విషయంపై మూడు రోజులుగా స్థానిక నాయకులతో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చర్చిస్తున్నారు. సీటు దక్కించుకునేందుకు హైదరాబాద్ లో తిష్టవేశారు ఆశావహులు. తాను బరిలో దిగబోనని వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించడంతో ఈసారి సీటును రెడ్డి సామాజికవర్గానికి కేటాయించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది.
వైసీపీకి కంచుకోటగా ఉన్న గిద్దలూరులో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. టికెట్ రేసులో ఆశావహులు భారీగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, కామూరి రమణారెడ్డి, చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఐవీ రెడ్డి, మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ ను కలిశారు ప్రవీణ్ కుమార్ రెడ్డి. మరోవైపు నాయకుల్లో ఏకాభిప్రాయం తెచ్చేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నారు.
Also Read : వైసీపీలో భారీగా మార్పులు చేర్పులు.. సీఎం జగన్ వ్యూహం ఏంటి? మరోసారి అధికారం దక్కేనా?
అభ్యర్థి ఎంపిక కసరత్తు.. ఓ కొలిక్కి రాకపోవడంతో నాయకులతో ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మాజీమంత్రి బాలినేని. ఇప్పటికే గిద్దలూరు ఇంచార్జ్ ఎంపికపై పలుసార్లు సీఎం జగన్ తో చర్చించారు బాలినేని. అభ్యర్ది ఎంపిక బాధ్యతను బాలినేనికి అప్పగించారు సీఎం జగన్. టికెట్ రేసులో భారీగా ఆశావహులు ఉన్నారు. ప్రధాన పరిశీలనలో చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి, కామూరి రమణారెడ్డి ఉన్నారు. టికెట్ ఆశిస్తున్న వారిలో ఎన్ఆర్ఐ ఐవీ రెడ్డి కూడా ఉన్నారు. గిద్దలూరు వైసీపీ టికెట్ ఆశిస్తున్న నేతలందరిని హైదరాబాద్ కు ఆహ్వానిస్తున్నారు బాలినేని.
Also Read : ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. సీఎం జగన్‌పై నిప్పులు
అందరినీ కూర్చోబెట్టి ఏకాభిప్రాయంతో అభ్యర్దిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాన్ని సీఎం జగన్ కు చెప్పి ఆయన నిర్ణయాన్ని బట్టి అభ్యర్దిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఈరోజు లేదా రేపు గిద్దలూరు అభ్యర్ధి విషయాన్ని ఫైనల్ చేసి సీఎం జగన్ కు నివేదించనున్నారు బాలినేని. మరోవైపు ఎమ్మెల్యే అన్నారాంబాబుకు మరోసారి అవకాశం కల్పించాలంటూ గిద్దలూరు నియోజకవర్గం నుండి భారీ వాహనాలతో హైదరాబాద్ కు వెళ్లి బాలినేనికి విన్నవించుకున్నారు అన్నా రాంబాబు అనుచర వర్గీయులు. ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నా.. ససేమిరా అంటున్నారు ఎమ్మెల్యే అన్నారాంబాబు.