వైసీపీలో భారీగా మార్పులు చేర్పులు.. సీఎం జగన్ వ్యూహం ఏంటి? మరోసారి అధికారం దక్కేనా?

సిట్టింగులను పక్కన పెట్టడానికి అసలు కారణాలేంటీ ? టికెట్లు దక్కని సిట్టింగులు కొత్త అభ్యర్థికి సహకరిస్తారా..? నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటీ?

వైసీపీలో భారీగా మార్పులు చేర్పులు.. సీఎం జగన్ వ్యూహం ఏంటి? మరోసారి అధికారం దక్కేనా?

CM Jagan Strategy Behind YCP Candidates Changes

CM Jagan Strategy : ఏపీలో అధికార వైసీపీ అభ్యర్థుల మార్పును ముమ్మరం చేసింది. ఇప్పటికి నాలుగు లిస్టులు విడుదల చేసింది. తొలి మూడు జాబితాల్లో 59 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను నియమించారు సీఎం జగన్. ఇక 9మందితో విడుదల చేసిన నాలుగో లిస్టులో 8 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాలకు ఇంఛార్జ్ లను ప్రకటించారు. వైసీపీలో ఇప్పటివరకు నాలుగు జాబితాలు ప్రకటించగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 68 మార్పులు జరిగాయి. ఇందులో 58 ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు జగన్.

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చేస్తున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు పూర్తిగా టికెట్ నిరాకరించారు. టికెట్ దక్కని వారికి నామినేటేడ్ పదవులు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా టికెట్లు దక్కని 28మంది ఎమ్మెల్యేలలో ఇద్దరిని రాజ్యసభ అభ్యర్థులుగా ఇప్పటికే ప్రకటించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్ ను రాజ్యసభ అభ్యర్థులుగా అనౌన్స్ చేసేశారు. దీంతో టికెట్లు దక్కని 28 మందిలో ఇద్దరికి ఊరట లభించింది.

Also Read : జూ.ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపు దేనికి సంకేతం? వివాదానికి అసలు కారణం ఏంటి?

ఓవరాల్ గా ఈ నాలుగు జాబితాలకు సంబంధించి ఎలాంటి మార్పులు జరిగాయి? సిట్టింగులను పక్కన పెట్టడానికి అసలు కారణాలేంటీ ? టికెట్లు దక్కని సిట్టింగులు కొత్త అభ్యర్థికి సహకరిస్తారా..? నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటీ? మొత్తం మార్పులు చేర్పులు కూర్పులపై 10టీవీ స్పెషల్ అనాలిసిస్..

Also Read : చంద్రబాబుతో వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు భేటీ.. టీడీపీ నాయకుల్లో టెన్షన్

 

వైసీపీలో మార్పులు చేర్పులు..

వైసీపీలో సీటు..వేటు
తోట నరసింహం – జగ్గంపేట
జ్యోతుల చంటిబాబు – జగ్గంపేట
———
వైసీపీలో సీటు..వేటు
వరుపుల సుబ్బారావు – ప్రత్తిపాడు
పర్వత ప్రసాద్ – ప్రత్తిపాడు
———-
వైసీపీలో సీటు..వేటు
వంగా గీత – పిఠాపురం
పెండం దొరబాబు – పిఠాపురం
———-
వైసీపీలో సీటు..వేటు
విప్పర్తి వేణుగోపాల్‌ – పి గన్నవరం (SC)
కొండేటి చిట్టిబాబు – పి గన్నవరం (SC)
———–
వైసీపీలో సీటు..వేటు
వెలంపల్లి శ్రీనివాసరావు – విజయవాడ సెంట్రల్‌
మల్లాది విష్ణు – విజయవాడ సెంట్రల్‌
­————
వైసీపీలో సీటు..వేటు
మాచాని వెంకటేశ్‌ – ఎమ్మిగనూరు
కె.చెన్నకేశవరెడ్డి – ఎమ్మిగనూరు
———-
వైసీపీలో సీటు..వేటు
మలసాల భరత్‌కుమార్‌ – అనకాపల్లి
గుడివాడ అమర్నాథ్ – అనకాపల్లి
———-
వైసీపీలో సీటు..వేటు
మేరుగు నాగార్జున – సంతనూతలపాడు (SC)
TJR సుధాకర్‌బాబు – సంతనూతలపాడు (SC)
————
వైసీపీలో సీటు..వేటు
గంజి చిరంజీవి – మంగళగిరి
ఆళ్ల రామకృష్ణారెడ్డి – మంగళగిరి
———-
వైసీపీలో సీటు..వేటు
వరికూటి రామచంద్రరావు – గాజువాక
తిప్పల నాగిరెడ్డి – గాజువాక
———–
వైసీపీలో సీటు..వేటు
విడదల రజిని – గుంటూరు వెస్ట్‌
మద్దాలి గిరి – గుంటూరు వెస్ట్‌
————-
వైసీపీలో సీటు..వేటు
బీఎస్‌.మక్బూల్‌ అహ్మద్‌ – కదిరి
పీవీ సిద్ధారెడ్డి – కదిరి
———–
వైసీపీలో సీటు..వేటు
కంభం విజయరాజు – చింతలపూడి (SC)
ఎలిజా – చింతలపూడి (SC)
——–
వైసీపీలో సీటు..వేటు
మెట్టు గోవిందరెడ్డి – రాయదుర్గం
కాపు రామచంద్రారెడ్డి – రాయదుర్గం
———-
వైసీపీలో సీటు..వేటు
బూచేపల్లి శివప్రసాదరెడ్డి – దర్శి
మద్దిశెట్టి వేణుగోపాల్ – దర్శి
———-
వైసీపీలో సీటు..వేటు
మూతిరేవుల సునీల్‌కుమార్‌ – పూతలపట్టు (SC)
ఎంఎస్‌.బాబు – పూతలపట్టు (SC)
——–
వైసీపీలో సీటు..వేటు
నిస్సార్‌ అహ్మద్‌ – మదనపల్లె
నవాజ్‌ బాషా – మదనపల్లె
——-
వైసీపీలో సీటు..వేటు
ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి – రాజంపేట
మేడా మల్లికార్జునరెడ్డి – రాజంపేట
———
వైసీపీలో సీటు..వేటు
డాక్టర్‌ సతీశ్‌ – కోడుమూరు (SC)
జె.సుధాకర్‌ – కోడుమూరు (SC)
———
వైసీపీలో సీటు..వేటు
మేరిగ మురళి – గూడూరు (SC)
వి.వరప్రసాదరావు – గూడూరు (SC)
———-
వైసీపీలో సీటు..వేటు
జోగి రమేశ్‌ – పెనమలూరు
కొలుసు పార్థసారథి – పెనమలూరు
———-
వైసీపీలో సీటు..వేటు
కంబాల జోగులు – పాయకరావుపేట (SC)
గొల్ల బాబురావు – పాయకరావుపేట (SC) – (రాజ్యసభ)
———
వైసీపీలో సీటు..వేటు
విజయానందరెడ్డి – చిత్తూరు
జంగాలపల్లి శ్రీనివాస్ – చిత్తూరు (రాజ్యసభ)
———-
వైసీపీలో సీటు..వేటు
జోలదరాశి శాంత – హిందూపురం ఎంపీ
గోరంట్ల మాధవ్ – హిందూపురం ఎంపీ
———-
వైసీపీలో సీటు..వేటు
గుమ్మనూరి జయరాం – కర్నూలు ఎంపీ
ఎస్‌.సంజీవ్ కుమార్ – కర్నూలు ఎంపీ
———–
వైసీపీలో సీటు..వేటు
కారుమూరి సునీల్‌కుమార్‌ – ఏలూరు ఎంపీ
కోటగిరి శ్రీధర్‌ – ఏలూరు ఎంపీ