చంద్రబాబుతో వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు భేటీ.. టీడీపీ నాయకుల్లో టెన్షన్

వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. చంద్రబాబు నాయుడును రహస్యంగా కలవడం పలువురు టీడీపీ నాయకుల్లో కలవరం రేపుతోంది.

చంద్రబాబుతో వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు భేటీ.. టీడీపీ నాయకుల్లో టెన్షన్

lavu sri krishna devarayalu meet chandrababu naidu

Updated On : January 22, 2024 / 6:34 PM IST

Lavu Sri Krishna Devarayalu: ఏపీ రాజకీయాల్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రహస్యంగా కలిశారు కృష్ణదేవరాయలు. గుంటూరు జిల్లా రాజకీయ పరిణామాలపై దాదాపు గంటర్నర పాటు చర్చించినట్టు తెలుస్తోంది. గుంటూరు, నరసరావుపేట రెండింటిలో ఎక్కడి నుంచి పోటీచేస్తారనే ఆప్షన్ కృష్ణదేవరాయలకే చంద్రబాబు ఇచ్చినట్టు సమాచారం. ముఖ్య అనుచరులతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని కృష్ణదేవరాయలు అన్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు తమ పార్టీ అధినేతతో భేటీ కావడం పలువురు టీడీపీ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. గుంటూరు, నరసరావుపేట ఎంపీ సీట్లపై పలువురు ఎన్నారైలు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు నరసరావుపేటపైనే కృష్ణదేవరాయలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మల్లిఖార్జునరావు కూడా ఆయన వెంట టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాగా, అటు వైసీపీ కూడా కృష్ణదేవరాయలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read: సీఎం జగన్ ఊహించని ట్విస్టులు.. వైసీపీ ఎమ్మెల్యేలలో జాబితా గుబులు

కాగా, ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం కోరిందని, తనకు మాత్రం నరసరావుపేటలోనే మళ్లీ పోటీ చేయాలని ఉందని అంతకుముందు ఎంపీ కృష్ణదేవరాయలు మీడియాతో చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవరావు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.