Karnataka Politics: ముఖ్యమంత్రి కుర్చీపై మళ్లీ మొదటికి వచ్చిన సీనియర్ నేత.. ‘దళితుడిని కాబట్టే అడ్డుకున్నారంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు

దళిత నాయకులంతా కలసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని పరమేశ్వర గుర్తు చేశారు. అప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తుందని, రాష్ట్రంలో జరిగే పరిణామాలను జాగ్రత్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో దళితులు, బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని పేర్కొన్నారు

G Parameshwara

G Parameshwara: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రి పదవికి తీవ్ర పోటీ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తర్వాత ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా వినిపించిన పేరు సీనియర్ నేత పరమేశ్వర్. అయితే కాంగ్రెస్ హైకమాండ్ పలు దఫాలు చర్చలు జరిపి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. అనంతరం పరమేశ్వర్‭కు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇంతటితో ముగిసిందనుకున్న వివాదాన్ని పరమేశ్వర్ మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.

N Chandrababu Naidu : లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలి, అందుకే కుప్పంను ఎంచుకున్నా- చంద్రబాబు

‘తానెందుకు ముఖ్యమంత్రి కాకూడదు?’ అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా తాను దళితుడినే కారణంతో తనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళిత సంఘాలు మంగళవారం ఎస్సీల సమావేశం నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన తన మనసులోని మాటలను బహిర్గతం చేశారు.

Maharashtra Politics: శివసేనపై మెత్తబడ్డ బీజేపీ.. అన్నదమ్ముల ఫైట్ అంటూ కవరింగ్

‘‘కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 2013లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా సీఎం కాలేకపోయాను. నా నాయకత్వంలో పార్టీ ప్రగతివైపు సాగినా నాకు సహకరించినవారు లేరు. నేనెప్పుడూ ఆ విషయాలు బహిర్గతం చేసుకోలేదు. 2018లో కాంగ్రెస్‌ ఓటమికి దళితులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కారణమైంది. దళిత సమాజాన్ని నిర్లక్ష్యం చేసినందుకు అగ్రనాయకులకు తగిన గుణపాఠం చెప్పినట్టయింది. దళిత నేతలకు సీఎం పదవి నిరాకరించారు. నేను లేదా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప, పౌర ఆహార సరఫరాల శాఖ మంత్రి కేహెచ్‌ మునియప్పలలో ఒకరు ఎందుకు ముఖ్యమంత్రి కారాదా’’ అని ఆయన ప్రశ్నించారు.

Bengal Politics: అదే కనుక జరగకుంటే బెంగాల్‭లో రక్తపాతం జరిగేదట.. పంచాయతీ ఎన్నికలపై బీజేపీ నేత ఘాటు వ్యాఖ్యలు

దళిత నాయకులంతా కలసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని పరమేశ్వర గుర్తు చేశారు. అప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తుందని, రాష్ట్రంలో జరిగే పరిణామాలను జాగ్రత్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో దళితులు, బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన పొగడ్తలు కురిపించడం గమనార్హం. సిద్దరామయ్య, డీకే శివవకుమార్‌ మధ్య రాజీ కుదర్చడంలో కాంగ్రెస్‌ విజయవంతమైందన్నారు. రానున్న లోక్‌సభ, బీబీఎంపీ ఎన్నిల్లో ఓటు బ్యాంకును చేజార్చుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు