చంద్రబాబులాగా బెదిరిస్తే భయపడే రకం కాదు జగన్ : కొడాలి నాని

  • Publish Date - January 20, 2020 / 11:09 AM IST

కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు జగన్ ను బెదిరించాలని  చంద్రబాబు నాయుడు చెపుతున్నాడని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు.  అసెంబ్లీలో ఈరోజు రాజధానిపై జరిగిన చర్చలో  ఆయన మాట్లాడుతూ…అమరావతిని రాజధానిలోనే కొనసాగించాలని జగన్ ను వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరించాలని చెపుతున్నారని….చంద్రబాబు లాగా  బెదిరిస్తే, బ్లాక్ మెయిల్ చేస్తే… జగన్ బెదిరే రకంకాదని…అయినా మేమెందుకు బెదిరించాలని చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు.

రాజకీయంగా బతికేందుకే చంద్రబాబునాయుడు కులాన్ని అడ్డుపెట్టుకున్నారని  కొడాలి నాని చెపుతూ …చంద్రబాబు అధికారంలోకి వస్తే టీవీ5, ఈనాడు ,ఆంధ్రజ్యోతి ఛానల్ పేపరు వాళ్లకే  లాభం తప్ప ఇంకెవరికీ లాభంలేదని అన్నారు. వీళ్లు రోజు టీవీ  పేపర్ల ద్వారా కమ్మ జాతికి అన్యాయం జరిగి పోయినట్లు ప్రచారం చేస్తున్నారని….వాస్తవానికి  జాతి ప్రయోజనాలు కన్నా… చంద్రబాబు అధికారంలోకి వస్తే  వీరికే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.

ఈరాష్ట్రంలో మా కులస్తులంతా  చంద్రబాబును ఎక్కువగా నమ్ముతామని …..ఈయన చెప్పగానే రోడ్డుమీదకు వచ్చి పోలీసులతో ఈడ్పించుకుని.. కొట్టించుకుని వీళ్లకోసం దెబ్బలు తింటున్నారని… కనుక కమ్మ సామాజిక వర్గ ప్రజలు ఈవిషయాన్నిగమనించాలని కొడాలి సూచించారు.