Congress President Poll: అధ్యక్ష రేసుపై శశి థరూర్ ఆత్మవిశ్వాసం.. కాంగ్రెస్, గాంధీ కుటుంబం మద్దతు తనకే ఉందట

భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని.. తాజాగా థరూర్ కలుసుకున్నారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతున్నారు. వాస్తవానికి గెహ్లాట్‭కు గాంధీ కుటుంబం మద్దతు మెండుగా ఉంది. అయితే రాజస్తాన్ పరిణామాల నేపథ్యంలో ఆయనపై గాంధీ కుటుంబం తీవ్ర అసంతృప్తితో ఉంది.

Congress President Poll: దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్దతు మెజారిటీ తనకే దక్కుతుందని శశి థరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన ఆయన.. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు గాంధీ కుటుంబ మద్దతు కూడా తనకే ఉంటుందని అన్నారు. రాజస్తాన్ పరిణామాల అనంతరం అశోక్ గెహ్లాట్‭ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత వైరాలతో కాంగ్రెస్ పార్టీని చీలుస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. ఏకంగా ఆయనను అధ్యక్ష రేసు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఇలాంటి తరుణంలో పార్టీ మద్దతు తనకే ఉంటుందంటూ థరూర్ వ్యాఖ్యానించారు.

‘‘నేను నామినేషన్ వేసే సందర్భంలో నాకు లభించే మద్దతు ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. ఈ పోటీపై నాకు విస్తృతమైన మద్దతు ఉంది. మెజారిటీ రాష్ట్రాలు నావైపు ఉన్నాయి. అంతే కాదు, దేశంలోని భిన్న ప్రాంతాల నుంచి అనేక మంది వ్యక్తులు ఈ పోటీలోకి దిగమని నన్ను కోరారు. వాళ్లే కాదు సోనియా, రాహుల్, ప్రియాంకల మద్దతు కూడా నాకే ఉంది. నీకు ఎలాంటి సమస్య రాదని వాళ్లు నాతో నేరుగా చెప్పారు’’ అని థరూర్ అన్నారు.

భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని.. తాజాగా థరూర్ కలుసుకున్నారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతున్నారు. వాస్తవానికి గెహ్లాట్‭కు గాంధీ కుటుంబం మద్దతు మెండుగా ఉంది. అయితే రాజస్తాన్ పరిణామాల నేపథ్యంలో ఆయనపై గాంధీ కుటుంబం తీవ్ర అసంతృప్తితో ఉంది. దీనిని అడ్వాంటేజీగా థరూర్ తీసుకుంటున్నారా లేదంటే.. అధిష్టానం థరూర్ అయితే బెటరని అనుకుంటోందా అనే విషయంలో స్పష్టత లేదు.

UP: పరీక్షలో తప్పు రాశాడని దళిత విద్యార్థిని చితకబాదిన టీచర్.. విద్యార్థి మృతి

ట్రెండింగ్ వార్తలు