అమరావతిపై కొడాలి నాని వ్యాఖ్యల వెనుక జగన్ వ్యూహముందా?

  • Publish Date - September 8, 2020 / 08:30 PM IST

కొడాలి నాని అంటేనే జగన్ అనుమతి లేకుండా ఏ ప్రకటనా చేయరని నమ్ముతున్న విపక్షం… అమరావతిపై ఆయన మాటలనూ సీరియస్‌గా తీసుకొంది. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చుతామని ప్రకటించిన సీఎం జగన్.. శాసనసభ, శాసన మండలి అమరావతిలోనే కొనసాగుతాయని తేల్చేశారు. చంద్రబాబు మాత్రం ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని పట్టుబడుతున్నారు.



ఈ సమయంలో ఏపీ మంత్రి కొడాలి నాని ఆఫీసు నుంచి వచ్చిన ఓ ప్రకటన పిడుగులా పడింది. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దన్నారు కొడాలి నాని. మూడు రాజధానుల విషయంలో బాగా దెబ్బతిన్నామని అమరామతి జనం భావిస్తున్నారు.



ఈ సమయంలో ఉన్న శాసన సభనూ వేరే చోటకు తరలిస్తామన్న ధోరణిలో… సీఎం జగన్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారని ఆయన అన్నారు. అన్ని పక్షాలతో మాట్లాడతాం. ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ అన్నారని ప్రకటన సారాంశం.



పేదలకు ఇళ్ల పట్టాలు ఇద్దామని అంటే కోర్టుకు వెళ్లి స్టే తెస్తున్నారు. పేదలకు చోటులేని శాసనరాజధాని ఎందుకని ఆయన తీవ్రంగానే మాట్లాడారు. అంతే టీడీపీ సిరియస్‌గా తీసుకుంది.