Gokulashtami : తిరుమలలో గోకులాష్టమి, ఉట్లోత్సవం..ఏర్పాట్లు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ‘గోకులాష్టమి’ ఆస్థానం నిర్వహించనున్నారు. స్వామిని సాక్షాత్తూ ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుంటారనే సంగతి తెలిసిందే.

TTD : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ‘గోకులాష్టమి’ ఆస్థానం నిర్వహించనున్నారు. ఆగస్టు 30వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి అనే సంగతి తెలిసిందే. వెంకటేశ్వరస్వామిని సాక్షాత్తూ ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆగస్టు 30వ తేదీ శ్రీవారి ఆలయంలో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.

Read More : Bollywood Stars Bodyguards : అమితాబ్ నుంచి షారుక్ ఖాన్ వరకు.. బాడీగార్డులకు కోట్లు చెల్లిస్తున్న స్టార్స్

ఈ సందర్భంగా సర్వభూపాల వాహనంపై శ్రీ కృష్ణ స్వామి వారిని వేంచేసి నివేదనలు సమర్పిస్తారు ఆలయ పండితులు. శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధానం చేపడుతారు.  ఆగస్టు 31వ తేదీన తిరుమలలో ఉట్లోత్సవం సందర్భంగా..సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారిని బంగారు తిరుచ్చిపై, శ్రీ కృష్ణ స్వామివారిని మరో తిరుచ్చిపై, ఆలయంలోని రంగనాయకుల మండపానికి వేంచేసి ఆస్థానం నిర్వహిస్తారు.

Read More : Fair Isle : ముగ్గురు విద్యార్థుల కోసం టీచర్ కావలెను..జీతం రూ.57 లక్షలు

ప్రతి సంవత్సరం తిరుమలలో ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్ప స్వామి వారు, శ్రీకృష్ణ స్వామి వార్లను తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ..భక్తులకు దర్శనిమివ్వనున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో…నిబంధనల మేరకు తిరుమలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాల‌ను ఏకాంతంగా టీటీడీ నిర్వ‌హించనుంది. ఉట్లోత్సవం సందర్భంగా..ఆగస్టు 31వ తేదీన శ్రీ వారి ఆలయంలో నిర్వహించే వర్చువల్ సేవలై ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

ట్రెండింగ్ వార్తలు