Chinna Jeeyar Swamy : సీఎం జగన్‌ను కలిసిన చినజీయర్ స్వామి

శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి వారు ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. 

Jagan China Jeeyar

Chinna Jeeyar Swamy :  శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి వారు ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. రామానుజాచార్యులు  అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివారు  ముచ్చింతల్‌ ఆశ్రమంలో చినజీయర్ స్వామి వారు తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం  జగన్‌ను ఆహ్వనిస్తూ పత్రిక అందచేశారు. అనంతరం స్వామి వారు ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందచేశారు.

Also Read:

వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు రామానుజలవారి సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీశ్రీశ్రీ చినజీయర్‌ స్వామి వారితో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు ముఖ్యమంత్రిని కలిసినన  వారిలో ఉన్నారు.