Satya Sai Prasanthi Nilayam : పుట్టపర్తిలో దర్శనాలు తిరిగి ప్రారంభం

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సమాధి దర్శనం ఈరోజు నుంచి తిరిగి ప్రారంభం అయ్యింది. ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి కర్ఫ్యూ వేళలలో సడలింపు ఇవ్వటంతో ప్రశాంతి నిలయంలోకి ఈరోజు నుంచి (జులై16) భక్తులను అనుమతిస్తున్నారు.

Satya Sai Prasanthi Nilayam : అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సమాధి దర్శనం ఈరోజు నుంచి తిరిగి ప్రారంభం అయ్యింది. ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి కర్ఫ్యూ వేళలలో సడలింపు ఇవ్వటంతో ప్రశాంతి నిలయంలోకి ఈరోజు నుంచి (జులై16) భక్తులను అనుమతిస్తున్నారు.

దాదాపు మూడు నెలల తరువాత బాబా వారి సమాధి దర్శనం తిరిగి ప్రారంభమవటంతో భక్తులు ఆనందిస్తున్నారు. ప్రశాంతి నిలయంలో నేటి నుంచి సత్యసాయి మహా సమాధి దర్శన భాగ్యం భక్తులకు కల్పిస్తున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది.

3 నెలల తర్వాత సత్యసాయి మహా సమాధి దర్శనం ప్రారంభం కావడంతో ప్రశాంతి నిలయం నూతన శోభను సంతరించుకుంది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ప్రశాంతి నిలయాన్ని మూసివేశారు. శుక్రవారం ఉదయం నుంచి భక్తులు సమాధిని దర్శించు కుంటున్నారు.  బాబా సమాధి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

ఈ సందర్భంగా సాయి కుల్వంత్ సభా మందిరంలో మహా సమాధిని ప్రత్యేక పూలతో విశేషంగా అలంకరణ గావించారు. ప్రతిరోజు ఉదయం హారతి తర్వాత  గం.9:30 గంటల నుండి 10:30 వరకు, సాయంత్రం హారతి తర్వాత గం.6:30 నుండి 7:30 గంటల వరకు భక్తులకు దర్శన అవకాశాలు కల్పిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు