అమ్మవారి ఏ అవతారానికి.. ఏ నైవేద్యం పెట్టాలంటే..

  • Publish Date - September 26, 2019 / 04:19 AM IST

దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శమిస్తుంది అమ్మవారు. రోజుకో ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. దేవాలయాల్లోనే కాకుండా ఇళ్లల్లో కూడా అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేసి నిత్యం నైవేద్యాలు పెడతారు. ఏ అలంకారంలో ఏ ప్రసాదాలు ఇష్టమో తెలుసుకుందాం!

మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి : ఇష్టమైన నైవేధ్యం పొంగలి. దీన్నే కొంతమంది అత్తెసరు అన్నం అనీ పొంగలి అని అంటారు.  
రెండో రోజు గాయత్రీ దేవి : పులిహోరను నైవేద్యంగా పెట్టాలి 
మూడో రోజు అన్నపూర్ణా దేవి : కొబ్బిరి అన్నం
నాలుగో రోజు కాత్యాయనీ దేవి : అల్లం గారెలు
ఐదో రోజు లలితా దేవి : దద్ధోజనం. అంటే పెరుగన్నం 
ఆరో రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి : రవ్వతో చేసిన కేసరి
ఏడో రోజు సరస్వతి దేవి : కదంబం (అన్నం, పప్పు, కూరగాయాలు వేసి వండినది)
ఎనిమిదో రోజు మహిషాసుర మర్ధిని : బెల్లం అన్నం దీన్నే తీపి పొంగలి అంటారు 
తొమ్మిదో రోజు రాజరాజేశ్వర దేవి : పరమాన్నం దీన్నే క్షీరాన్నం అని అంటారు.

ఆ తల్లి సకల సకల సరాచర ప్రాణులకు అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి. భక్తులు చిత్తశుద్ధితో పెట్టే నైవేద్యాలను స్వీకరించటమంటే అమ్మకు చాలా ఇష్టం. తన బిడ్డలకు చేతులో సమర్పించిన చిటికెడు నైవేద్యమైన హృదయపూర్వకంగా స్వీకరిస్తుంది. అలా భక్తులు పెట్టిన నైవేద్యం స్వీకరించి భక్తులకు ఆయురారోగ్యాలతో పాటు శక్తి సామర్థ్యాలను.. ఎప్పటికీ కీర్తి ప్రతిష్టలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.