Mahashivratri 2022 : శ్రీశైలంలో మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష

కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఏపీ దేవాదాయశాఖ కమిషనర్ హరిజవాహర్ లాల్ దేవస్థానం అధికారులతో శ్రీశైలంలో స

Mahashivaratri

Mahashivratri 2022 :  కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఏపీ దేవాదాయశాఖ కమిషనర్ హరిజవాహర్ లాల్ దేవస్థానం అధికారులతో శ్రీశైలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో లవన్న,అధికారులు ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ముందుగా ఈవో ఎస్.లవన్న దేవస్థానం నిర్వహించబోతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి కమిషనర్ కు వివరించారు.

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ శివరాత్రికి విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు పకడ్బందీగా చేయాలన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు నల్లమల అటవీ మార్గమధ్యంలో వసతి,మంచినీరు వైద్య సదుపాయాలు జిల్లా అధికారులు కలసి  త్వరగతిన ఏర్పాట్లు చేయాలన్నారు.

క్షేత్రంలో పారిశుద్ధ్యం,వైద్యం,వసతి పార్కింగ్ సామాన్లు భద్రపరచుటకు ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సమన్వయంతో కృషి చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అన్నారు. శ్రీశైల మహాక్షేత్రం మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా రాబోయే 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా బహుత్తర ప్రణాళికతో అభివృద్ధి ఏర్పాట్లు చేయాలని కమీషనర్ దేవాలయ అధికారులను  కోరారు.