Raksha Mantra: రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రం చదవండి.. తోబుట్టువులకు దివ్య రక్షణ.. సకల శుభాలు కలుగుతాయ్
రాఖీ (Raksha Mantra)కట్టే సమయంలో పఠించే మంత్రానికి రాక్షస రాజైన మహాబలి పౌరాణిక కథతో ముడిపడి ఉంది.
- V Santhosh Kumar
- Published on- August 25, 2026 / 06:00 PM IST
Raksha bandhan rakhi tying mantra puja vidhi and significance
- పవిత్ర రక్షాబంధన్ పండుగ ప్రాశస్త్యం
- రాఖీ కట్టే మంత్రం విశిష్టత
- సాంప్రదాయ పూజా విధాన నియమాలు
Raksha Mantra: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు నిదర్శనమైన పవిత్రమైన పండుగ రక్షాబంధన్. ఈ పండుగ రోజున సోదరి తన సోదరుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అతడి కుడిచేతికి రాఖీ కడుతుంది. సోదరుడు కూడా తన సోదరిని జీవితాంతం రక్షిస్తానని మాట ఇచ్చి తన ప్రేమకు గుర్తుగా బహుమతులను అందిస్తాడు. రక్షాబంధన్ వేళ కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలను పాటిస్తే ఇరువురికీ ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతుంటారు. అందులో ముఖ్యమైనది రాఖీ కట్టే సమయంలో పఠించాల్సిన పవిత్ర మంత్రం.
YS Jagan: ఏకగ్రీవాలు జరిగితే MLA సీటు దక్కదు.. పార్టీ నేతలకు జగన్ హెచ్చరిక
రాఖీ మంత్రం వెనుక ఉన్న పౌరాణిక కథ:
రాఖీ(Raksha Mantra) కట్టే సమయంలో పఠించే మంత్రానికి రాక్షస రాజైన మహాబలి పౌరాణిక కథతో ముడిపడి ఉంది. అత్యంత దానశీలి, శక్తివంతుడైన బలి చక్రవర్తిని ఏ రక్షాసూత్రంతోనైతే కట్టారో, అదే శక్తివంతమైన రక్షాసూత్రంతో తన సోదరుడిని కడుతున్నట్లు ఈ మంత్రం తెలియజేస్తుంది. “ఓ రక్షాసూత్రమా! నువ్వు ఎల్లవేళలా స్థిరంగా ఉండి నా సోదరుడికి పూర్తి రక్షణగా నిలవు” అని వేడుకోవడమే ఈ ప్రార్థన అంతరార్థం. ఈ మంత్రాన్ని స్మరిస్తూ రాఖీ కట్టడం వల్ల సోదరుడికి జీవితంలో సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
రాఖీ కట్టే విధానం, పూజా నియమాలు:
రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడానికి ముందుగా ఒక పూజా పళ్లెంలో రాఖీ, కుంకుమ, బియ్యం, దీపం, స్వీట్లను సిద్ధం చేసుకోవాలి. సోదరుడిని తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం చేసి కూర్చోబెట్టి, ముందుగా నుదుటిపై కుంకుమ, అక్షతలతో తిలకం దిద్దాలి. ఆ తర్వాత ఆయన కుడిచేతికి పవిత్ర మంత్రాన్ని పఠిస్తూ రాఖీ కట్టాలి. అనంతరం హారతి ఇచ్చి తీపి తినిపించాలి. సోదరుడు కూడా అక్కాచెల్లెళ్లకు వారి ఇష్టమైన బహుమతులు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
