విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపై ఆంక్షలు 

విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపై ఆంక్షలు విధించారు.

  • Publish Date - January 17, 2019 / 11:25 AM IST

విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపై ఆంక్షలు విధించారు.

విజయవాడ : తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపై ఆంక్షలు విధించారు. తలసాని వ్యాఖ్యల నేపథ్యంలో ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. దుర్గగుడికి వచ్చే రాజకీయ నాయకుల గురించి మీడియాకు ముందస్తు సమాచారం ఇవ్వకూడదని నిర్ణయించారు. 

ఆలయ ప్రాంగణంలో రాజకీయ, వ్యాపార పోస్టర్లు అంటించకుండా, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులు మంది మార్బలంతో రాకుండా పరిమితంగా రావాలని ఈవో సూచించారు. ఆలయంలో రాజకీయాలు మాట్లాడకూడదని..అమ్మవారి గురించి మాత్రమే మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు.

తలసాని రిటర్న్ గిఫ్ట్ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై తలసాని కౌంటర్ కూడా ఇచ్చారు.