Sri Rama Navami 2026 : శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి.. మార్చి 26 లేదా 27నా..? పండితులేమంటున్నారంటే..
Sri Rama Navami 2026 : శ్రీరామ నవమి పండగను ఎప్పుడు జరుపుకోవాలి మార్చి 26 లేక 27న పండితులు ఏమంటున్నారంటే..
sri rama navami 2026 date is the festival on march 26 or 27 details here
Sri Rama Navami 2026 : హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. దాదాపు దేశమంతా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఊరువాడా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. మన దగ్గర భద్రాచలంలో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణ వేడుక జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అధికారికంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇదిలా ఉంచితే.. ఈ మధ్య కాలంలో హిందూ పండుగల నిర్వహణలో కాస్త గందరగోళం ఎదురవుతోంది. దీంతో పండుగ జరుపుకునే తేదీలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే ఈసారి శ్రీరామనవమి పండుగ విషయంలో కూడా ఇదే అనుమానం తెరమీదకు వచ్చింది. శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి.. మార్చి 26 లేక 27నా అనే సందేహం నెలకొంది. దీనిపై పండితులు ఏం చెబుతున్నారంటే..
ఎప్పుడైనా సరే.. శ్రీరామనవమి పండుగను నవమి తిథి నాడే జరుపుకుంటారు. అయితే ఈసారి నవమి తిథి మార్చి 26, 27 రెండు రోజుల్లో ఉంది. దీంతో శ్రీరామనవమిని ఏ రోజు జరుపుకోవాలనే ప్రశ్న తలెత్తింది. పురాణాల ప్రకారం చూసుకుంటే శ్రీరామచంద్రుడు.. చైత్ర మాసంలో శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజు, పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్నంలో జన్మించాడని చెబుతారు. అందుకే ప్రతి ఏటా ఆ రోజున ఎంతో ఘనంగా శ్రీరామనవమిని జరుపుకుంటున్నారు.
పండుగ ఎప్పుడు జరుపుకోవాలంటే.. హిందూ పంచాంగం ప్రకారం, నవమి తిథి మార్చి 26 గురువారం మధ్యాహ్నం ప్రారంభమై.. మార్చి 27 శుక్రవారం మధ్యాహ్నం ముగుస్తుంది. అలాగే పునర్వసు నక్షత్రం మార్చి 26 రాత్రి 07:03 నిమిషాలకు ప్రారంభమై, మార్చి 27 శుక్రవారం సాయంత్రం 05:44 నిమిషాల వరకు ఉంటుంది. సాధారణంగా పండుగలను జరుపుకోవడానికి సూర్యోదయం సమయానికి ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం చూసుకుంటే.. నవమి తిథి మార్చి 27న ఉదయం ఉంది. కనుక మార్చి 27 శుక్రవారం రోజున సీతారాముల కళ్యాణం, అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం నిర్వహిస్తారు. అందువల్ల 2026 మార్చి 27న శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
