Sri Rama Navami 2026 : పెళ్లి కాని వారికి అలర్ట్.. శ్రీరామనవమి రోజు ఈ ఒక్క పని చేయండి.. ఇక మీ వివాహాన్ని ఎవరూ ఆపలేరు
Sri Rama Navami 2026 : పలు రకాల దోషాల వల్ల వివాహం కానీ వారు.. శ్రీరామనవమి నాడు ఈ పని చేస్తే మంచిదంటున్నారు పండితులు.
sri rama navami 2026 divine solution for delayed marriages details here
Sri Rama Navami 2026 :
హిందూ సమాజంలో సీతారాములకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరిని విడిచి ఒకరు ఉండరని.. భార్యాభర్తలంటే అలాగే కలిసి ఉండాలని చెబుతుంటారు. ఇక శ్రీరామనవమి రోజు దేశమంతా సీతారాముల కళ్యాణాన్ని చాలా ఘనంగా జరుపుతారు. తమ ఇంట్లో పెళ్లి జరుగుతున్నంతగా సంబరపడతారు. మరి ఇంత ప్రత్యేకమైన శ్రీరామనవమి నాడు కొన్ని పనులు చేయడం వల్ల కోరిన కోర్కెలు తీరతాయని.. శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా శ్రీరామనవమి నాడు.. పెళ్లి కాని యువతీయువకులు ఒక చిన్న పని చేస్తే త్వరగా వివాహం అవుతుందని చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొందరి జాతకాల్లో కాలసర్ప, కుజ, శుక్ర దోషాలు వంటివి ఉండటం వల్ల వివాహాలు ఆలస్యం అవుతుంటాయి. ఇలాంటి దోషాలు తొలగిపోవాలంటే దైవ శక్తి ఎంతో అవసరమంటారు పండితులు. ఆ శక్తి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తికి ఉందని నమ్ముతారు. అందుకే పైన చెప్పిన దోషాల వల్ల వివాహం కాకపోయినా.. ఆలస్యం అవుతున్నా.. అవివాహితులు ఆ రామయ్య కళ్యాణం నాడు ఒక పని చేస్తే సరిపోతుందంటున్నారు.
కొన్నాళ్ల క్రితం వరకు కూడా రాములవారి కళ్యాణం అయ్యే వరకు ఇళ్లలో పెళ్లిళ్లు జరిగేవి కావు. శ్రీరాములవారి కళ్యాణం జరిగిన తర్వాత, ఆ పవిత్రమైన తలంబ్రాలను ఇంట్లో వివాహం కానటువంటి యువతీ యువకుల శిరస్సు పైన వేసినట్లయితే, వారికి త్వరగా వివాహం అవుతుందని నమ్ముతారు. మరి పెళ్లి కాని యువతీయువకులు ఈ ఆచారాన్ని పాటిస్తే.. మీకు కూడా త్వరగా వివాహం అవుతుందని పండితులు చెబుతున్నారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడం లేదు.
