TTD February 2027 Tickets : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి శ్రీవారి సేవా టికెట్ల విడుదల తేదీలు వచ్చేశాయ్!

TTD February 2027 Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 2027 ఆర్జిత సేవలు, రూ.300 దర్శనం, వసతి గదుల టికెట్ల విడుదల తేదీలు, పూర్తి బుకింగ్ షెడ్యూల్ వివరాలపై ఓసారి లుక్కేయండి..

TTD February 2027 Tickets

  • తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
  • 18 నుంచి ఫిబ్రవరి నెల టికెట్ల బుకింగ్ షురూ
  • శ్రీవారి దర్శన టికెట్లు ఎలా పొందాలంటే?

TTD February 2027 Tickets : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ (TTD) కీలక అప్‌డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల టికెట్ల విడుదల తేదీలను ప్రకటించింది.

దీంతో ఫిబ్రవరిలో తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులు ఇప్పటి నుంచే రెడీ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది. ఏ టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

18న ఆర్జిత సేవల టికెట్ల డిప్ రిజిస్ట్రేషన్ :
ఫిబ్రవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌ను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ప్రారంభించనుంది. భక్తులు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు పొందినవారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించాలి..

21 నుంచి వరుసగా టికెట్ల విడుదల :
ఈ నెల 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లు విడుదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటా కూడా అందుబాటులోకి వస్తుంది.

Read Also : BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జి.. బీఎం సందీప్‌కు కీలక బాధ్యతలు!

23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శనం టికెట్లు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల అవుతాయి.

24న రూ.300 దర్శన టికెట్లు :
24న ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల అద్దె బుకింగ్ ప్రారంభమవుతుంది..

భక్తులు టికెట్ల కోసం చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దు.. ముందుగానే వివరాలు రెడీ చేసుకోవడం మంచిది. అధికారిక వెబ్‌సైట్ (https://ttdevasthanams.ap.gov.in) ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది..