Hanuman Jayanti 2026 : హనుమాన్ జయంతి ఎప్పుడు.. ఏప్రిల్ 1 లేదా 2 నా.. ఆ రోజు ఈ చిన్న పని చేస్తే ఆర్థిక సమస్యలు మాయం..!
Hanuman Jayanti 2026 : హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో హనుమాన్ జయంతి ఒకటి. మరి ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఎప్పుడు వస్తుంది.. ఆరోజు చేయాల్సిన చేయకూడని పనులు ఏంటి..
When we celebrate hanuman jayanti 2026 on april 1 or 2nd puja samay dos and don'ts details here
Hanuman Jayanti 2026 : హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి ఒకటి. ఆంజనేయుడి జన్మదినోత్సవం సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆంజనేయుడిని.. భక్తి, శక్తి, ధైర్యం, కర్మపరమైన విజ్ఞానానికి ప్రతీకగా పూజిస్తారు. హైదరాబాద్ నగరంలో అయితే శోభాయాత్ర కూడా నిర్వహిస్తారు. మరి హిందువులు ఇంత ఘనంగా జరుపుకునే పండుగ ఈసారి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు పాటించాల్సిన నియమాలు, చేయాల్సిన పూజలు వంటి వివరాలు..
హనుమాన్ జయంతి 2026 తేదీ, సమయం
ఈ సంవత్సరం హనుమాన్ జయంతి.. 2 ఏప్రిల్ 2026, గురువారం నాడు వస్తుంది. ఈ సంవత్సరం హనుమ జయంతి చైత్ర పూర్ణిమతో కలిసి వస్తుంది.
- చైత్ర పూర్ణిమ ప్రారంభం: 1 ఏప్రిల్ 2026, బుధవారం ఉదయం 07:06 గంటలకు.
- చైత్ర పూర్ణిమ ముగింపు: 2 ఏప్రిల్ 2026, గురువారం ఉదయం 07:41 గంటలకు.
- కనుక ఏప్రిల్ 2, గురువారం నాడు హనుమాన్ జయంతి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ప్రభాత పూజ
- హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి.. హనుమాన్ గుడికి వెళ్లాలి.
- ఈ పండుగ నాడు ప్రత్యేకంగా “హనుమాన్ చాలీసా” పఠనం చేసుకోవాలి.
- దేవుడి ప్రతిమను పూలతో, ఫలాలతో, పంచామృతంతో అర్చిస్తారు.
వ్రతం, ఉపవాసం
హనుమాన్ జయంతి నాడు వ్రతం చేసి ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఉపవాసం ద్వారా శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక బలం పెరుగుతుందని నమ్ముతారు.
ప్రయోజనాలు
- భయాలు, ఆందోళనలు, విఘ్నాలు తొలగిపోతాయి.
- శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది
- కష్ట సమయంలో సహనం, ధైర్యం, సంకల్ప బలం పెంపొందుతుంది..
- శ్రీరామ భక్తి ద్వారా కర్మపరమైన విజ్ఞానం, ధర్మ మార్గం సాధించగలరు.
చేయాల్సిన పనులు
- ఆంజనేయుడికి సింధూరం, ఎర్రటి పువ్వులు సమర్పిస్తే మంచిదని పండితులు అంటున్నారు.
- నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
- కోతులకు బెల్లం, అరటి పండ్లు, శనగపప్పు తినిపించడం చాలా పవిత్రం.
- ఈ రోజున ఎరుపు లేదా కుంకుమ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం.
- హనుమాన్ ఆలయానికి వెళ్లి 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి.
చేయకూడని పనులు
- మద్యం, మాంసాహారం వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు.
- ఏ జంతువును ఇబ్బంది పెట్టకూడదు లేదా గాయపరచకూడదు.
- విరిగిన హనుమంతుడి విగ్రహాన్ని పూజించకూడదు.
ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి..
ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు హనుమాన్ జయంతి నాడు.. స్వామి వారికి గులాబీ పూల మాల సమర్పించి, చామంతి నూనెతో దీపం వెలిగించాలి. ఆ దీపంలో రెండు లవంగాలు వేస్తే ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు
