India Tour Of South Africa : ధావన్, కోహ్లీ అవుట్.. తడబడుతున్న భారత్

33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్ క్రమ్, మహరాజ్, తబ్రెయిజ్ షంసి తలా ఒక వికెట్ తీశారు...

India And South Africa : సిరీస్ కోల్పోయాం..ఎలాగైనా వన్డేలో గెలిచి తీరాలని అనుకున్న టీమిండియా తడబడుతోంది. మంచి ఫాంలో ఉన్న ధావన్ మరింత రెచ్చిపోతాడు..కోహ్లీ మ్యాచ్ ను విజయతీరాలకు చేరుస్తాడని అనుకున్న క్రీడాభిమానులకు నిరాశే మిగిలింది. సెంచరీ వైపుకు దూసుకెళుతున్న ధావన్ అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ సాధించి..కొద్దిసేపు క్రీజులో ఉన్న కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో పంత్, శ్రేయాస్ అయ్యర్ లు ఆచితూచి ఆడుతున్నారు. వికెట్ పోకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. సౌతాఫ్రికాతో టీమిండియా వన్డే మ్యాచ్ జరుగుతోది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా, వాండర్ డస్సెన్ లు సెంచరీలు సాధించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది.

Read More : Jammu Kashmir Vaccination : అప్పుడు ట్రెక్కింగ్, ఇప్పుడు మోకాళ్ల లోతు మంచులో నడుస్తూ..వ్యాక్సినేషన్

అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 46 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాహుల్ (12) అవుట్ అయ్యాడు. అప్పటికే ఓపెనర్ ధావన్ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. అడపదడపా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. ఇతనికి కోహ్లీ చక్కగా సహకరించాడు. ఇతను కూడా సౌతాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ..స్కోరు పెరిగేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరూ కలిసి హాఫ్ సెంచరీలు సాధించడంతో దక్షిణాప్రికా టీంలో కలవరం మొదలైంది. వీరిద్దరీని విడగొట్టేందుకు బౌలర్లు ప్రయత్నించారు. వీరి ప్రయత్నం సక్సెస్ అయ్యింది.

Read More : India Vs South Africa : ధీటుగా బదులిస్తున్న భారత్.. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ

138 పరుగుల వద్ద ఉన్నప్పుడు కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో ధావన్ (79) అవుట్ అయ్యాడు. 84 బంతులను ఎదుర్కొన్న ధావన్ 10 ఫోర్లు బాదాడు. అనంతరం కోహ్లీ (51) కూడా పెవిలియన్ చేరాడు. పంత్ 14, శ్రేయాస్ అయ్యర్ 15 పరుగులతో ఆడుతున్నారు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బౌలర్లలో మార్ క్రమ్, మహరాజ్, తబ్రెయిజ్ షంసి తలా ఒక వికెట్ తీశారు.

ట్రెండింగ్ వార్తలు