Jammu Kashmir Vaccination : అప్పుడు ట్రెక్కింగ్, ఇప్పుడు మోకాళ్ల లోతు మంచులో నడుస్తూ..వ్యాక్సినేషన్

ఓ హెల్త్ వర్కర్ మోకాళ్ల లోతులో ఉన్న మంచులో నడుచుకుంటూ...ప్రజలకు వ్యాక్సినేషన్ వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jammu Kashmir Vaccination :  అప్పుడు ట్రెక్కింగ్, ఇప్పుడు మోకాళ్ల లోతు మంచులో నడుస్తూ..వ్యాక్సినేషన్

Jammu

Covid Vaccine worker Snowy mountains : కరోనా..ఈ దిక్కుమాలిన వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఎంతో మంది ఈ వైరస్ బారిన పడుతూ..చనిపోతున్నారు. దీని నుంచి రక్షించుకోవాలంటే..జాగ్రత్తగా ఉండడంతో పాటు వ్యాక్సినేషన్ కంపల్సరీ అని కేంద్రం చెబుతోంది. అందులో భాగంగా..వ్యాక్సినేషన్ ప్రక్రియను జోరుగా చేపడుతోంది. ఇంకా కొంతమంది వ్యాక్సిన్ తీసుకోలేకపోవడంతో వారిని గుర్తించి టీకా వేస్తున్నారు. ఇందులో హెల్త్ వర్కర్ల కృషి ఎంతో ఉంది. మారుమూల ప్రాంతాలకు వెళ్లడం, కొండలపై ఉన్న గ్రామాలకు సైతం వెళ్లి..అక్కడి వారికి వ్యాక్సినేషన్ వేస్తూ..అందరికీ ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే..ఓ హెల్త్ వర్కర్ మోకాళ్ల లోతులో ఉన్న మంచులో నడుచుకుంటూ…ప్రజలకు వ్యాక్సినేషన్ వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More : Adimulapu Suresh : కరోనా వస్తే.. ఆ స్కూలు మాత్రమే మూసివేస్తాం

జమ్మూ కాశ్మీర్. అతిచల్లగా ఉండే ప్రాంతం. ఇక చలికాలం అయితే పరిస్థితి చెప్పనక్కర్లేదు. భారీగా మంచు కురుస్తుంటుంది. ఎక్కడికక్కడ మంచు భారీగా పేరుకపోతుంటుంది. ఎముకలు కొరికే చలిలో సైతం హెల్త్ వర్కర్ మస్రత్ ఫరీద్ వ్యాక్సినేషన్ వేసేందుకు సాహసమే చేశారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా…పీపీఈ కిట్ ధరించిన ఆమె మోకాళ్ల లోతు మంచులో నడుస్తూ…విధులను నిర్వర్తించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీని జయించాలన్న లక్ష్యంతో మంచుగడ్డల్లో నడిచారు. కొంతమంది వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని, కోవిడ్ తో పోరాడుతూ ముందుకు సాగాలన్నారు మస్రత్. గతంలో కూడా ఈమె..ట్రెక్కింగ్ చేస్తూ..చాలా మందికి వ్యాక్సినేషన్ వేశారు.