తొలివన్డే: రోహిత్ ఒంటరిపోరు: భార‌త్‌కు తప్పని ఓటమి

భారత డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన టీమిండియాను గట్టెక్కించలేకపోయింది. టాప్ అండ్ మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది.

  • Publish Date - January 12, 2019 / 11:21 AM IST

భారత డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన టీమిండియాను గట్టెక్కించలేకపోయింది. టాప్ అండ్ మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది.

  • ఫలించని భారత్ వ్యూహం.. టాప్, మిడల్ ఆర్డర్ వైఫల్యం 

  • 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు

సిడ్నీ: భారత డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన టీమిండియాను గట్టెక్కించలేకపోయింది. టాప్ అండ్ మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. రోహిత్ శర్మ సెంచరీ వృథా అయినట్టు అయింది. సిడ్నీ వేదికగా శనివారం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. 289 విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఆది నుంచి నిలకడగా ఆడుతూ స్కోరును బోర్డును పరుగులు పెట్టించాడు. 129 బంతుల్లో (10ఫోర్లు, 6 సిక్స్) 133 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. వన్డే కెరీర్ లో రోహిత్ కు ఈ మ్యాచ్ 22వ వన్డే కావడంతో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ, రోహిత్ ఒంటరిపోరాటం టీమిండియాను గెలిపించలేకపోయింది.

ధోనీ, రోహిత్ మినహా అంతా పేలవం.. 
నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులే చేసి పరాజయం పాలైంది. ఎంఎస్ ధోనీ (51) హాఫ్ సెంచరీ మినహా మిగతా ఆటగాళ్లు ఎవరూ డబుల్ డిజిట్ దాటలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్, స్టెయినీస్ రెండు వికెట్లు, రిచార్డ్ సన్ నాలుగు వికెట్లు, పీటర్ సిడెల్ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకుమందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకోగా, జడేజా ఒక వికెట్ తీసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 తో ఆధిక్యంలో ఉంది. 

ట్రెండింగ్ వార్తలు