Beijing Winter Olympics : బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలకం

బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం కొనసాగుతోంది. తాజాగా 45మంది కోవిడ్ బారిన పడ్డారు.

Beijing Winter Olympics 2022

Beijing Winter Olympics : బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం కొనసాగుతోంది. తాజాగా 45మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో 26మంది కొత్తగా విదేశాల నుంచి వచ్చినవారున్నారు. మిగతా వారిలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న అథ్లెట్లతో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు. దీంతో వింటర్ ఒలింపిక్స్ లో మొత్తం కరోనా కేసులు 353కి చేరాయి. అయితే, ప్రస్తుత కేసుల సంఖ్య అదుపులోనే ఉందని, తాము ఊహించిన దానికంటే ఎక్కువ కాదని నిర్వాహకులు తెలిపారు.

Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం అయ్యాయి. వింటర్‌ ఒలింపిక్స్‌ కోసం జనవరి 23 నుంచి మొత్తం 12 వేల మంది అథ్లెట్లు, వారి సిబ్బంది విదేశాల నుంచి చైనాకు వచ్చారు. వారిలో 353 మంది కోవిడ్ బారిన పడ్డారు. మరోవైపు వింటర్‌ ఒలింపిక్స్‌ కోసం భారత్‌ నుంచి ఒకే ఒక్క ఆటగాడు ఆరిఫ్‌ ఖాన్‌ పాల్గొంటున్నాడు. ఇప్పటికే అతడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం జాతీయ జెండాను చేతబూని స్టేడియంలో భారత బృందాన్ని ముందుకు నడిపించాడు. అతడు స్లాలోమ్‌, జెయింట్‌ స్లాలోమ్‌ విభాగాల్లో స్కీయింగ్‌ పోటీల్లో పాల్గొననున్నాడు.

వింటర్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు సంతోషంగా ఉందని స్కీయర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ అన్నాడు. జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్‌కు చెందిన 31 ఏళ్ల ఆరిఫ్‌.. తానింకా మెరుగుపడాల్సి ఉందని చెప్పాడు. ఈ గేమ్‌ను భారతీయులకు పరిచయం చేయాలన్నది తన కల అని చెప్పాడు. వింటర్‌ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఏకైక భారతీయుడిని కావడం ద్వారా యువతకు ప్రేరణగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. మౌంటెయిన్‌ స్కీయింగ్‌లో అవకాశాలున్నాయని ఇప్పుడు చాలా మందికి తెలుసని ఆరిఫ్‌ ఖాన్‌ అన్నాడు.

Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

‘‘మనకు పర్వతాలు ఉన్నాయి. మంచు ఉంది. గుల్మార్గ్‌లో అల్పైన్‌ స్కీయింగ్‌ ఉచిత రైడ్‌ కూడా ఉంది. ఇంకొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే వచ్చే నాలుగు ఐదేళ్లలో శీతాకాల క్రీడలకు మనం పెద్ద గమ్యస్థానం అవుతాం. క్రీడలు, పర్యటకం కోసం హిమాలయాలను ఉపయోగించుకోవచ్చు. ఇది ఆరంభం మాత్రమే. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గొప్పగా అనిపిస్తోంది. యువతను, ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌ యువతకు ప్రేరణనివ్వడం నా కల. ఇంకా మెరుగుపడడానికి ప్రయత్నిస్తా’’ అని ఆరిఫ్‌ చెప్పాడు.