KL Rahul Pic: @BCCI
KL Rahul: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో టీమ్ ఇండియా, వెస్టిండీస్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ బాదాడు. తొలిరోజు ఆటముగిసే సమయానికి 38 ఓవర్ల నాటికి క్రీజులో కేఎల్ రాహుల్ 53, శుభ్‌మన్ గిల్ 18 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 121/2గా ఉంది.
యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేసి ఔటయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో జైడన్, రోస్టన్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read: పండగ రోజు పొద్దుపొద్దున్నే మద్యం తాగి.. ఈ యువకులు ఏం చేశారో చూడండి.. ఇప్పుడు దసరాను ఎలా జరుపుకోవాలి?
వెస్టిండీస్ బ్యాటర్లలో జాన్ క్యాంప్‌బెల్ 8, చంద్రపాల్ 0, అలిక్ అతనాజే 12, బ్రాండన్ కింగ్ 13, రాస్టన్ చేజ్ 24, షై హోప్ 26, జస్టిన్ గ్రీవ్స్ 32, ఖారీ పియెర్ 11, వారికాన్ 8, జోహాన్ లేన్ 1, జేడెన్ సీల్స్ 6 పరుగులు తీశారు.
ఒకే ఏడాదిలో 600 పరుగుల మార్క్
ఈ అర్ధశతకంతో కేఎల్ రాహుల్ ఈ ఏడాది చేసిన పరుగుల మొత్తం 600 పరుగుల మార్క్‌ను దాటింది. 2017 తర్వాత తొలిసారి టెస్టుల్లో ఒకే ఏడాదిలో అతడు 600 పరుగులకు మించి చేశాడు. 2017లో రాహుల్ 633 పరుగులు చేశాడు. 2025లో ఆయన సగటు 50. తన కెరీర్‌లో తొలిసారి ఒకే ఏడాదిలో 700 పరుగుల మార్క్‌ను కూడా దాటే అవకాశం ఉంది.