a-billion-get-booster-dose-from-brisbane-world-wakes-up-to-watch-indian-crickets-big-rising
ఒక సిరీస్.. రెండు విజయాలు.. ఒక ఘోర పరాజయం.. ఎన్నో పాఠాలు.. ఎన్నో పొగడ్తలు.. మరెన్నో తిట్లు.. ఆస్ట్రేలియాలో మనోళ్లు సత్తా చూపెట్టిన రోజు.. టీమిండియా సమిష్ట కృషి.. టెస్ట్‌లలో మనోళ్ల పోరాటం ప్రపంచవ్యాప్తంగా తెలిసినరోజు.. దేశంలో ప్రతి ఒక్కరూ సామాన్యుని నుంచి ప్రధానివరకు ప్రస్తుతం పొగడ్తల్లో ముంచేస్తున్నారు. 19 జనవరి 2021 చరిత్రలో ఈ తేదీకి ఒక రోజు కేటాయించారు టీమిండియా యువ ఆటగాళ్లు.. సీనియర్లు లేకున్నా.. యువ నాయకత్వంలో రహేనే సేన ఆస్ట్రేలియాపై హిస్టారికల్ విక్టరీ సాధించింది.
ఇప్పుడైతే టీమిండియాను పొగడ్తల వర్షంలో ముంచేస్తున్నారు కానీ, సరిగ్గా నెల క్రితం ఇదే రోజు.. 19 డిసెంబర్ 2020 నాడు.. భారత జట్టు క్రికెట్ చరిత్రలో దారుణ పరాభవాన్ని చవిచూసింది. టీమిండియా ప్రతిష్టను మసకబారేలా చేస్తూ.. చరిత్రలో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సాధించుకున్న పరువు అంతా 36 పరుగులకే ఆలౌట్ అయ్యి టీమిండియా పోగొట్టుకుంది. బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలిపోగా.. క్రికెట్ అభిమానులు తిట్టిపోశారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుని.. కోచ్ రవిశాస్త్రిని కూడా తిట్టిపోశారు.
అయితే తిట్టిపోసిన భారత అభిమానులే ఇప్పుడు నెత్తిన పెట్టుకోగా.. ఓడిపోయినప్పుడు తిట్టేవాడికన్నా.. గెలుస్తావ్ అంటూ ఎంకరేజ్ చేసి ఉంటే బాగుండేది కదా? అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా బ్రిస్బెన్ టెస్టు.. టెస్ట్ చరిత్రలోనే ఓ సంచలనం. టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన విజయం.
టీమిండియా కుర్రాళ్లు చెలరేగి ఆడగా.. 1988లో చివరిసారి ఆ మైదానంలో ఆస్ట్రేలియన్ జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఈ మైదానంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ విజయంతో 2-1 తేడాతో మరోసారి ఆసీస్ వేదికగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని గెలిచి, తమ దగ్గరే ఉంచుకుంది టీమిండియా.