cricket Fan : నువ్వు టీమ్ఇండియా కోచ్‌గా రా బాసూ..! నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్న ఫ్యాన్‌.. వీడియో

cricket Fan video : ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు భార‌త ప్లేయ‌ర్లను ఎలా బోల్తా కొట్టించారు అన్న విష‌యాలను ఓ క్రికెట్ ఫ్యాన్ చ‌క్క‌గా వివ‌రించాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో వ‌రుస విజ‌యాల‌తో అల‌రించిన‌ భార‌త జ‌ట్టు ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓట‌మి పాలైంది. మూడో సారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకుంటుంద‌ని భావించిన అభిమానులకు నిరాశ త‌ప్ప‌లేదు. ఫైన‌ల్ మిన‌హా టోర్నీ ఆసాంతం టీమ్ఇండియా ప్లేయ‌ర్లు అద్భుతంగా ఆడారు. కాగా.. ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు భార‌త ప్లేయ‌ర్లను ఎలా బోల్తా కొట్టించారు అన్న విష‌యాలను ఓ క్రికెట్ ఫ్యాన్ చ‌క్క‌గా వివ‌రించాడు.

ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సూర్య‌కుమార్ యాద‌వ్‌ను స్లో బౌన్స‌ర్ల‌ల‌తో ఎలా ప్లాన్ చేసి ఔట్ చేశారు. జంపా చేత బౌలింగ్ చేయించ‌కుండా మాక్స్‌వెల్ చేత బౌలింగ్ చేయించి రోహిత్ శ‌ర్మ వికెట్ ఎలా ప‌డ‌గొట్టారు వంటి విష‌యాల‌ను అత‌డు చ‌క్క‌గా వివ‌రించాడు. అంతేకాదు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించిన 90వేల‌కు పైగా టీమ్ఇండియా మ‌ద్ద‌తు దారుల‌ను మౌనంగా చేసిన పాట్ క‌మిన్స్ వ్యూహాల‌ను అత‌డు ప్ర‌శంసించాడు.

Suresh Raina: రైనా, ఓజాకు ధోని విందు.. సాక్షి వెరైటీ ఎక్స్‌ప్రెష‌న్ వైరల్

నెట్టింట ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఆట‌ప‌ట్ల అత‌డికి ఉన్న ప‌రిజ్ఞానాన్ని చూసిన నెటీజ‌న్లు అత‌డిని త‌దుప‌రి టీమ్ఇండియా కోచ్‌గా రావాల‌ని సూచిస్తున్నారు. ‘నిజం చెప్పాలంటే ఫామ్‌, గ‌ణాంకాల ప్ర‌కారం భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియా కంటే ఎంతో మెరుగ్గా ఉంది. అయితే.. ఆసీస్ వ్యూహాత్మ‌కంగా ఆడింది. భార‌త బ్యాట‌ర్ల‌ను నియంత్రించ‌డానికి వారు చ‌క్క‌టి ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చించారు. ‘అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేశారు. ‘ఇలాంటి అభిమానులు కావాలి. అంతేగానీ క్రికెట‌ర్లు వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి తొంగి చూసేవారు కాదు.’ అని మ‌రొక‌రు అన్నారు.

ఆరోసారి..

నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66) రోహిత్ శ‌ర్మ (47) లు రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. అనంత‌రం ట్రావిస్ హెడ్ (137) భారీ శ‌త‌కం బాద‌డంతో ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో విజేత‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో శ‌త‌కం చేసిన ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రాగా.. టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన విరాట్ కోహ్లీ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక‌య్యాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ చివ‌రి టీ20 మ్యాచ్ ఆడేశాడా..?

ట్రెండింగ్ వార్తలు