IND vs ENG
India vs England : టీ20ల రాకతో టెస్టులకు ఆదరణ తగ్గిపోతుందని ఓ పక్క మాజీ ఆటగాళ్లు బాధపడుతున్నారు. ఎలాగైన సరే టెస్టులకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు. అయితే.. మిగిలిన దేశాల్లో టెస్టు మ్యాచ్ పరిస్థితి ఎలాగున్నా సరే భారత దేశంలో టెస్టు క్రికెట్ ఆదరణ ఉంది అన్నదానికి ఉప్పల్ టెస్టు మ్యాచే నిదర్శనం.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. మొదటి రోజు ఆటకు సుమారు 24 వేల మంది స్టేడియానికి రాగా, రెండో రోజు మ్యాచ్ చూసేందుకు 30 వేల 886 మంది వచ్చారు. ఇక మూడో రోజు 30వేల 598 మంది హాజరు అయ్యారు. కాగా.. ఈ మధ్య కాలంలో దేశంలో జరిగిన మరే టెస్టు మ్యాచ్‌కు ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరు కాలేదు. కాగా.. హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిన గత తొమ్మిది టెస్టు మ్యాచుల సందర్భంలో ఎన్నడూ 20 వేలకు మించి ఫ్యాన్స్ మైదానానికి రాలేదు.
IND vs ENG : సిరాజ్ అవసరం లేదు..! రెండో టెస్టులో అతడిని పక్కన పెట్టండి
అయితే.. ఈ సారి పాఠశాల విద్యార్థులతో పాటు ఆర్మీ, నేవీ, వైమానికి దళానికి హెచ్‌సీఏ ఉచిత ప్రవేశం కల్పించడంతో పాటు విసృతంగా ప్రచారం చేయడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. మైదానంలోని ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు స్వయంగా మైదానంలోని అన్ని స్టాండ్లను తనిఖీ చేశారు.
A total of 1,18,000 attended the India Vs England Test in Hyderabad.
– A fantastic number for a Test match in India, Hyderabadi people are really passionate about the game. pic.twitter.com/SjeA6L1vG2
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2024