×
Ad

Suryakumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ పై మాజీ ఆట‌గాడి ఆగ్ర‌హం.. టాస్ వేస్తే స‌రిపోతుందా?

టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) గ‌త కొంత‌కాలంగా పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు.

Aakash Chopra angry on Suryakumar Yadav latest form in T20s

Suryakumar Yadav : టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ గ‌త కొంత‌కాలంగా పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట‌ర్ టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచ‌రీ చేయ‌క 20 ఇన్నింగ్స్‌లు దాటింది. గ‌తేడాది న‌వంబర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సూర్య 13.35 స‌టుతో 227 పరుగులు మాత్ర‌మే చేశాడు. స్ట్రైక్‌రేటు కూడా ఏమంత గొప్ప‌గా లేదు. ప్ర‌స్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల హోమ్ సిరీస్‌లో కూడా అతని పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి టీ20 మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన అత‌డు రెండో టీ20 మ్యాచ్‌లో 5 ప‌రుగులు మాత్రమే సాధించాడు.

ఈ క్ర‌మంలో సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav ) ఫామ్ పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు ఆకాశ్ చోప్రా సైతం సూర్య‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కెప్టెన్ అంటే టాస్ వేయ‌డం, బౌల‌ర్ల‌తో ఓవ‌ర్లు వేయించ‌డం మాత్ర‌మే కాద‌న్నాడు. టాప్‌-4లో బ్యాటింగ్ చేసే స‌మ‌యంలో ఖ‌చ్చితంగా ప‌రుగులు సాధించాల‌న్నాడు.

Vaibhav Suryavanshi : ఈ ఏడాది కోహ్లీ కంటే ఎక్కువ‌గా బుడ్డోడినే వెతికారు.. వైభ‌వ్ సూర్య‌వంశీ రియాక్ష‌న్ వైర‌ల్‌

‘గ‌త 17 ఇన్నింగ్స్‌ల్లో అత‌డి స‌గ‌టు 14 మాత్ర‌మే. ఇక స్ట్రైక్‌రేటు కూడా బాగాలేదు. ఇన్ని మ్యాచ్‌ల్లో క‌నీసం ఒక్క‌సారి కూడా హాఫ్ సెంచ‌రీ చేయ‌లేదు. ఓ రెండు సార్లు మాత్ర‌మే అత‌డు 25 కంటే ఎక్కువ ప‌రుగులు సాధించాడు.’ అని చోప్రా అన్నాడు.

సూర్యకుమార్ భారత జట్టుకు నాయకత్వం వహించడాన్ని తాను వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశాడు. అయితే 2026 T20 ప్రపంచ కప్‌లోకి స‌మ‌యానికి అత‌డు ఫామ్ అందుకోవాల‌న్న‌దే త‌న ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చాడు. ఫామ్ లేమీతో ప్ర‌పంచ‌క‌ప్‌లో అడుగుపెడితే.. అప్పుడు స‌ద‌రు ఆట‌గాడికి త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఉండ‌ద‌న్నాడు. ఇక కెప్టెన్ సూర్య‌తో పాటు వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ సైతం ఫామ్ అందుకోవాల‌న్నాడు.