Aakash Chopra backs Ruturaj Gaikwad to replace Shubman Gill ahead of Guwahati Test
IND vs SA : కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. కాగా.. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఓ స్వీప్ షాట్ ఆడే క్రమంలో మెడ పట్టేయడంతో రిటైర్డ్ ఔట్‌గా టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మైదానాన్ని వీడాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు బరిలోకి దిగలేదు. అతడికి వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరం అని సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం (నవంబర్ 22) నుంచి గౌహతి వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌లో గిల్ పాల్గొనడం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
రెండో టెస్టుకు గిల్ అందుబాటులో లేకుంటే అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విజ్ఞప్తి చేశాడు. తన యూట్యూబ్ ఛాన్‌లో చోప్రా మాట్లాడుతూ.. ‘శుభ్‌మన్ గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. అయితే.. అతడు రెండో టెస్టు మ్యాచ్ ఆడతాడో లేదో అన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. నా అభిప్రాయం ప్రకారం ఒకవేళ గిల్ దూరం అయితే అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను తీసుకోవాలి. ‘అని చోప్రా తెలిపింది.
NZ vs WI : న్యూజిలాండ్‌కు భారీ షాక్..
సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్‌లు రిజ్వర్ ఆటగాళ్లుగా ఉన్నారని, అయితే.. ఈ ఇద్దరు కూడా ఎడమచేతి వాటం బ్యాటర్లు అని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని తీసుకున్నా కూడా.. ఇప్పటికే జట్టులో ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండడంతో మొత్తం ఏడుగురు లెఫ్ట్ హ్యాండర్లు అవుతారని, ఇది సమంజసం కాదన్నాడు.
ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. భారత్-ఏ తరుపున నిలకడగా పరుగులు చేస్తున్నాడని తెలిపాడు. రంజీ ట్రోఫీ అయినా, దులీఫ్ ట్రోఫీ అయినా కూడా పరుగులు చేస్తున్నాడని, అయినప్పటికి కూడా అతడికి రెడ్‌బాల్ క్రికెట్‌లో అవకాశాలు రావడం లేదన్నాడు. మిడిల్ ఆర్డర్‌లో చక్కగా సరిపోతాడన్నారు.