AB De Villiers : కొడుకు వ‌ల్ల కంటిచూపు కోల్పోయా.. వాళ్లు చెప్ప‌డంతోనే రిటైర్మెంట్ .. ఏబీ డివిలియ‌ర్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

AB De Villiers retirement reason : కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండ‌గా 2018లో డివిలియ‌ర్స్ స‌డెన్‌గా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

AB De Villiers retirement reason

ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెట‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న‌దైన విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల‌ను అత‌డు సొంతం చేసుకున్నాడు. ఇక ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత‌డి విన్యాసాల‌ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. అభిమానులు అత‌డిని ముద్దుగా ‘మిస్ట‌ర్ 360’ అని పిలుచుకుంటారు. అయితే.. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండ‌గా 2018లో డివిలియ‌ర్స్ స‌డెన్‌గా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అత‌డి నిర్ణ‌యంతో ఆ స‌మ‌యంలో క్రీడా ప్ర‌పంచం ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. అయితే.. తాను ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు అన్న విష‌యాల‌ను మాత్రం అత‌డు అప్పుడు చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంలో ఇరు జ‌ట్ల బ‌లాబ‌లాల‌ను విశ్లేషిస్తూ.. తాను ఎందుకు ఆక‌స్మాత్తుగా రిటైర్‌మెంట్ తీసుకోవాల్సి వ‌చ్చింద‌నే విష‌యాల‌ను డివిలియ‌ర్స్ తాజాగా వెల్ల‌డించాడు. త‌న చిన్న‌కొడుకు అనుకోకుండా త‌న కంటిని త‌న్నిన‌ట్లు చెప్పాడు. దీంతో త‌న ఎడ‌మ కంటికి గాయ‌మైంద‌ని, దృష్టి లోపించింద‌ని చెప్పుకొచ్చాడు.

India tour of South Africa : మూడేళ్ల న‌ష్టాలు ఒక్క సిరీస్‌తో దూరం..! మ‌రో మూడేళ్ల వ‌ర‌కు ఢోకా లేదు..!

ఆట‌కు దూరంగా ఉండ‌మ‌న్నారు..

శ‌స్త్ర‌చికిత్స అనంత‌రం డాక్ట‌ర్లు క్రికెట్ ఆడ‌కూడ‌ద‌ని చెప్పారని తెలిపాడు. డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కే అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి అర్థాంత‌రంగా త‌ప్పుకున్న‌ట్లు వెల్ల‌డించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ప్ప‌టికీ రెండేళ్ల పాటు ప్రాంఛైజీ క్రికెట్ మాత్రం ఆడాన‌ని, అదృష్ట వ‌శాత్తు ఆ స‌మ‌యంలో త‌న కంటి వ‌ల్ల ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌లేద‌న్నాడు. కాగా.. ఐపీఎల్ 2021 సీజ‌న్ ఆడిన డివిలియ‌ర్స్ ఆ త‌రువాత అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకున్నాడు.

2004లో ద‌క్షిణాఫ్రికా త‌రుపున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు ఏబీ డివిలియ‌ర్స్‌. త‌న కెరీర్‌లో స‌ఫారీ జ‌ట్టు త‌రుపున 114 టెస్టులు, 228 వ‌న్డేలు, 78 టీ20 మ్యాచులు ఆడాడు. 114 టెస్టుల్లో 50.7 స‌గ‌టుతో 8765 ప‌రుగులు చేశాడు. ఇందులో 22 సెంచ‌రీలు, 46 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. 228 వ‌న్డేల్లో 53.5 స‌గ‌టుతో 9577 ప‌రుగులు చేశాడు. ఇందులో 25 శ‌త‌కాలు, 53 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.

MS Dhoni : 20 కిలోల బ‌రువు త‌గ్గితే ఐపీఎల్‌లో తీసుకుంటాన‌న్న ధోని.. కానీ అతడు మాత్రం..

78 టీ20 మ్యాచుల్లో 26.1 స‌గ‌టుతో 1672 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో 184 మ్యాచులు ఆడాడు. 39.7 స‌గ‌టుతో 3403 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు శ‌త‌కాలు, 40 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో 2008 నుంచి 2010 వ‌ర‌కు ఢిల్లీ డేర్ డేవిల్స్ త‌రుపున ఆడిన డివిలియ‌ర్స్ ఆ త‌రువాత 2011 నుంచి 2021 వ‌ర‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) జ‌ట్టుకు ఆడాడు.

ట్రెండింగ్ వార్తలు