×
Ad

Abhishek Sharma : అభిషేక్.. ఆ కొట్టుకు ఏందీ సామీ.. 60 నిమిషాల్లో 45 సిక్స‌ర్లు..

గ‌త కొంత‌కాలంగా టీమ్ఇండియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు.

Abhishek Sharma 45 sixes in nets ahead of Vijay Hazare Trophy clash

Abhishek Sharma : గ‌త కొంత‌కాలంగా టీమ్ఇండియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. టీ20ల్లో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు నిద్ర‌లేని రాత్రుళ్లు మిగులుస్తున్నాడు. తాను ఎదుర్కొనే బంతిని స్టాండ్స్‌కు పంపించ‌డ‌మే ల‌క్ష్యంగా అత‌డు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆదివారం (డిసెంబ‌ర్ 28) జైపూర్‌లో జ‌రిగిన ప్రాక్టీస్ సెష‌న్‌లో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. గంట వ్య‌వ‌ధిలోనే ఏకంగా 45 సిక్స‌ర్లు బాదేశాడు.

అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma )విజ‌య్ హ‌జారే ట్రోఫీలో పంజాబ్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆదివారం జైపూర్ శివార్ల‌లోని ఓ మైదానంలో అత‌డు ప్రాక్టీస్ చేశాడు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో తాను ఎదుర్కొన్న బంతుల‌ను అన్నింటిని కూడా భారీ షాట్లు ఆడాడు. దాదాపు అత‌డు 45 సిక్స‌ర్లు కొట్టిన‌ట్లు అక్క‌డ ఉన్న ప‌లువురు రిపోర్ట‌ర్లు పేర్కొన్నారు.

IND vs NZ : న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌.. హార్దిక్ తో పాటు ఆ స్టార్ ఆట‌గాడికి విశ్రాంతి!

ఇందులో చాలా బంతుల‌ను అత‌డు ఎక్స్‌ట్రా క‌వ‌ర్ మీదుగా బాదిన‌ట్లు తెలిపారు. దీని చూసిన పంజాబ్ కోచ్ సందీప్ శ‌ర్మ ఆశ్చ‌ర్య‌పోయాడ‌ట‌. వెంట‌నే అత‌డు అభిషేక్‌తో ఎక్స్‌ట్రా క‌వ‌ర్ సిక్స‌ర్ల‌తోనే సెంచ‌రీ చేస్తావా అని స‌ర‌దాగా అడిగాడ‌ట‌. దీనికి అభిషేక్ చిన్న‌గా న‌వ్వుతూ మ‌రో షాట్ కూడా ఎక్స్ ట్రా కవ‌ర్ మీదుగానే ఆడాడట‌.

ఇదిలా ఉంటే.. 2024లో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అభిషేక్ శ‌ర్మ అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు టీమ్ఇండియా త‌రుపున 33 మ్యాచ్‌లు ఆడాడు. 32 ఇన్నింగ్స్‌ల్లో 36 స‌గ‌టుతో 1115 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు శ‌త‌కాలు, 6 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక అత‌డు ఈ మ్యాచ్‌ల్లో మొత్తంగా 73 సిక్స‌ర్లు బాదాడు.