IND vs NZ : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హార్దిక్ తో పాటు ఆ స్టార్ ఆటగాడికి విశ్రాంతి!
వచ్చే నెలలో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో (IND vs NZ) పర్యటించనుంది.
IND vs NZ ODI series No Hardik Pandya and Jasprit Bumrah reports
IND vs NZ : వచ్చే నెలలో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఆతిథ్య భారత్‌తో కివీస్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. తొలుత వన్డే, ఆపై టీ20 సిరీస్ లు జరగనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. అదే జట్టు ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఎవరెవరు ఆడతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. ఈ సిరీస్‌కు స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్ల పనిభారం దృష్ట్యా, టీ20 ప్రపంచకప్ 2026 ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సదరు వార్తల సారాంశం.
AUS vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లాండ్‌కు భారీ షాక్..
పాండ్యా లేకుంటే ఆ స్థానాన్ని నితీశ్ కుమార్ రెడ్డితో భర్తీ చేసే అవకాశం ఉంది. అతడు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఉన్నాడు. అయినప్పటికి కూడా అతడికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇక రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా జితేశ్ శర్మలో ఒకరికి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ తరువాత ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. అదే సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా కూడా వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ తరువాత వన్డేల్లో ఆడలేదు.
Gautam Gambhir : గంభీర్ నువ్వు కూడా రంజీ జట్లకు కోచ్‌గా వెళ్లు.. అప్పుడే..
భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే మ్యాచ్ – జనవరి 11 (వడోదర)
* రెండో వన్డే మ్యాచ్ – జనవరి 14 (రాజ్ కోట్)
* మూడో వన్డే మ్యాచ్ – జనవరి 18 (ఇండోర్)
