Abhishek Sharma
Abhishek Sharma: ఆసియా కప్ 2025లో మైదానంలో బ్యాట్‌తో విరుచుకుపడ్డ భారత ప్లేయర్ అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ర్యాంకింగ్స్ హిస్టరీలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్ తర్వాత అభిషేక్ శర్మ రేటింగ్ పాయింట్లు 931గా ఉన్నాయి. టీ20 చరిత్రలో ఇవే అత్యధిక రేటింగ్ పాయింట్స్.
ఆసియా కప్ 2025లో 7 మ్యాచ్‌ల్లో అభిషేక్ 314 పరుగులు సాధించాడు. సగటు దాదాపు 45, స్ట్రైక్ రేట్ 200తో బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో టీ20ల్లో బ్యాట్స్‌మన్‌గా అత్యుత్తమ రేటింగ్ సాధించాడు.
ఆసియా కప్ సెమీఫైనల్‌లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ అర్ధశతకం సాధించాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత అతని రేటింగ్ పెరిగింది. 2020లో ఇంగ్లాండ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ సాధించిన 919 పాయింట్ల రికార్డును అభిషేక్ అధిగమించాడు. భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ సాధించిన అత్యధిక రేటింగ్‌లను కూడా అధిగమించాడు అభిషేక్.
ఇప్పటివరకు అత్యధిక రేటింగ్ సాధించిన వారు(టీ20ల్లో), టాప్-6 ప్లేయర్స్
ఆసియా కప్ సెమీఫైనల్‌లో శ్రీలంకపై అభిషేక్ శర్మ 931 రేటింగ్ పాయింట్లతో కెరీర్‌లో అత్యధిక రికార్డు సాధించాడు (ప్రపంచ రికార్డు, కెరీర్ బెస్ట్ రేటింగ్). కానీ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి రేటింగ్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఐసీసీ వీక్లీ అప్‌డేట్‌లో అతడి అధికారిక రేటింగ్ 926 పాయింట్లుగా నిలిచింది. ఇప్పటికీ ప్రపంచంలో 1వ స్థానంలోనే ఉన్నాడు.
ICC T20I rankings