India A vs UAE : అభిషేక్ శ‌ర్మ విధ్వంసం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భార‌త్‌..

ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్ 2024 టీ20 టోర్నీ‌లో భార‌త్‌-ఏ జోరు కొన‌సాగుతోంది.

ACC T20 Emerging Teams Asia Cup India A thrash UAE by seven wickets

India A vs UAE : ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్ 2024 టీ20 టోర్నీ‌లో భార‌త్‌-ఏ జోరు కొన‌సాగుతోంది. అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తూ సెమీఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. సోమ‌వారం యూఏఈతో జ‌రిగిన ఏక ప‌క్ష పోరులో 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది. 16.5 ఓవ‌ర్ల‌లో 107 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. యూఏఈ బ్యాట‌ర్ల‌లో రాహుల్ చోప్రా (50; 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. మిగిలిన ఆట‌గాళ్లు విఫ‌లం కావ‌డంతో యూఏఈ స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమిత‌మైంది. భార‌త బౌల‌ర్ల‌లో ర‌సిఖ్ స‌లామ్ మూడు వికెట్లు తీశాడు. ర‌మ‌ణ్‌దీప్ సింగ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అన్షుల్‌ కాంబోజ్, వైభవ్‌ అరోరా, అభిషేక్, నేహాల్ త‌లా ఓ వికెట్ సాధించారు.

Sarfaraz Khan : కివీస్‌తో తొలి టెస్టులో భారీ సెంచ‌రీ.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు ప్ర‌మోష‌న్‌..

అనంత‌రం ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ (58; 24 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో భార‌త్ 10.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్, తెలుగు తేజం తిలక్ వర్మ(21; 18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ ) రాణించాడు. దీంతో వ‌రుస‌గా రెండు విజ‌యాలు సాధించ‌డంతో భార‌త్ త‌న గ్రూప్‌లో 4 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉంది. దీంతో భార‌త్‌-ఏ సెమీస్‌కు దూసుకువెళ్లింది.

ఇక ఒక్కొ మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్‌, యూఏఈ జ‌ట్లు బుధ‌వారం త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు సెమీస్‌లో అడుగుపెట్ట‌నుంది. ఇక భార‌త్ గ్రూప్ ద‌శ‌లో ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో బుధ‌వారం ఒమ‌న్‌ను ఢీ కొట్ట‌నుంది. ఒమ‌న్ రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది.

Kane Williamson: న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్.. రెండో టెస్టుకు కేన్ విలియమ్సన్ దూరం