Adair brothers lead Ireland to historic T20I win vs South Africa
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ నుంచి దక్షిణాఫ్రికాకు ఏదీ కలిసి రావడం లేవు. టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో గెలవాల్సిన మ్యాచును ఓడిపోయింది. ఆ తరువాత వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-3తేడాతో ఓడిపోయింది. ఇక అఫ్గానిస్థాన్ చేతిలో వన్డే సిరీస్ ను 1-2తేడాతో కోల్పోయింది. ఇక తాజాగా టీ20 మ్యాచులో పసికూన ఐర్లాండ్ చేతిలోనూ ఓడిపోయింది.
టీ20ల్లో దక్షిణాఫ్రికా పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ గెలుపుతో రెండు మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.
IPL: ఐపీఎల్‌లో ఆడే భారత్ క్రికెటర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన బీసీసీఐ
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. రాస్ అదైర్ (100; 58 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగాడు. అతడితో పాటు పాల్ స్టిర్లింగ్ (31 బంతుల్లో 52) హాఫ్ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాలో బౌలర్లలో వియాన్ ముల్దర్ రెండు, ఎంగిడి, విలియమ్స్, క్రుగెర్ తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో రీజా హెండ్రిక్స్ (51; 32 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్), మాథ్యూ బ్రీట్జ్కి (51; 41 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకాలతో చెలరేగగా, ర్యాన్ రికెల్టన్ (36; 22 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించినప్పటికి దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులకే పరిమితమైంది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ నాలుగు వికెట్లతో గెలుపులో కీలక పాత్ర పోషించాడు. గ్రహం హ్యూమ్ మూడు వికెట్లు తీయగా మాథ్యూ హంఫ్రేస్, బెంజమిన్ వైట్ చెరో వికెట్ సాధించారు.
WHAT A NIGHT.
Ireland win first-ever Men’s T20I against South Africa (and tie the series 1-1).
Match report 👉 https://t.co/8t3QAMVQpx#IREvSA #BackingGreen pic.twitter.com/VNlfxVYNTz
— Cricket Ireland (@cricketireland) September 29, 2024