IPL: ఐపీఎల్‌లో ఆడే భార‌త్ క్రికెట‌ర్ల‌కు అదిరిపోయే శుభ‌వార్త చెప్పిన బీసీసీఐ

ఐపీఎల్ లో ఆడే భారత్ క్రికెటర్లకు బీసీసీఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐపీఎల్ - 2025 సీజన్ నుంచి ప్రతీ ఆటగాడికి మ్యాచ్ ఫీజు

IPL: ఐపీఎల్‌లో ఆడే భార‌త్ క్రికెట‌ర్ల‌కు అదిరిపోయే శుభ‌వార్త చెప్పిన బీసీసీఐ

Jai Shah

Updated On : September 29, 2024 / 10:59 AM IST

IPL Match Players : ఐపీఎల్ లో ఆడే భారత్ క్రికెటర్లకు బీసీసీఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐపీఎల్ – 2025 సీజన్ నుంచి ప్రతీ ఆటగాడికి మ్యాచ్ ఫీజు కూడా చెల్లించేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఒక్కో మ్యాచ్ కు రూ. 7.5లక్షలు చెల్లించనున్నారు. ఒక ఆటగాడు సీజన్ లో మొత్తం 14 లీగ్ మ్యాచ్ లు ఆడితే మ్యాచ్ ఫీజు రూపంలో రూ.1.05కోట్లు నగదు లభించనుంది.

Also Read : IND vs BAN: యువ పేస‌ర్ వ‌చ్చేశాడు.. బంగ్లాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టును ప్రకటించిన బీసీసీఐ

జై షా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు పెంచాలని నిర్ణయించుకున్నాం. మా క్రికెటర్లు ఇకపై ఒక్కో గేమ్ కు రూ.7.5లక్షల ఫీజు అందుకోనున్నారు. ఈ చారిత్రత్మక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఓ క్రికెటర్ సీజన్ లో అన్ని మ్యాచ్ లు ఆడితే కాంట్రాక్ట్ మొత్తంతో పాటు అదనంగా రూ.1.05కోట్లు పొందుతాడు. ప్రతీ ఫ్రాంచైజీ సీజన్ మ్యాచ్ ఫీజుగానూ రూ.12.60 కోట్లు కేటాయిస్తుంది. ఐపీఎల్ కు, ప్లేయర్లకు ఇది కొత్త శకం అని జైషా పేర్కొన్నారు.

 

బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా ఐపీఎల్ వేలంలో తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ఆటగాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఒక ప్లేయర్ కు ఐపీఎల్ ప్రాంచైజీ రూ.20లక్షలు చెల్లిస్తే .. ఒక సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడితే రూ. 20లక్షలు పొందడమే కాకుండా మ్యాచ్ ఫీజుగా బీసీసీఐ అందించే రూ. 1.05 కోట్లు అందుతుంది.