IND vs BAN: యువ పేస‌ర్ వ‌చ్చేశాడు.. బంగ్లాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టును ప్రకటించిన బీసీసీఐ

బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ జట్టు కెప్టెన్ గా ..

IND vs BAN: యువ పేస‌ర్ వ‌చ్చేశాడు.. బంగ్లాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టును ప్రకటించిన బీసీసీఐ

IND vs BAN T20I Series

Updated On : September 29, 2024 / 7:27 AM IST

IND vs BAN T20I Series: బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ జట్టు కెప్టెన్ గా 15మంది సభ్యుల బృందాన్ని సెలెక్టర్లు ఎంపిక చేశారు. యువ పేసర్ మయాంక్ యాదవ్ టీ20 పార్మాట్ లో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్ లో 150 కిలోమీటర్ల వేగంతో స్థిరంగా బంతులు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన 22ఏళ్ల మయాంక్.. గాయంతో టోర్నీ మధ్యలో వైదొలిగాడు. ప్రస్తుతం అతను కోలుకోవటంతో బీసీసీఐ మయాంక్ యాదవ్ కు చోటు కల్పించింది.

Also Read : County Championship : బ్యాట‌ర్ క్లీన్‌బౌల్డ్ అయినా ఔట్ ఇవ్వ‌ని అంపైర్‌.. ఇలాంటి ఓ రూల్ కూడా ఉందా? ట‌వ‌ల్ కార‌ణ‌మా?

మయాంక్ తో పాటు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఇటీవల ఐపీఎల్ లో సత్తాచాటిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణాలు కూడా బంగ్లాతో సిరీస్ లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ జట్టులో సూర్యకుమార్ కాకుండా హార్దిక్ పాండ్య మాత్రమే సీనియర్. మిస్టరీ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి 2021లో భారత్ తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. మూడేళ్ల తరువాత మళ్లీ టీమిండియాలోకి వస్తున్నాడు. మరోవైపు వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మలకు అవకాశం కల్పించారు. వీరిలో ఒకరిని తుది జట్టుకు ఎంపిక చేయనున్నారు. అయితే, ఇంతకుముందు శ్రీలంకతో సిరీస్ లోని రెండు మ్యాచ్ లలో శాంసన్ సున్నా స్కోర్ తో ఔటయ్యాడు. బంగ్లాదేశ్ జట్టుతో భారత్ మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. మొదటి అక్టోబర్ 6న, రెండో మ్యాచ్ 9న, మూడో మ్యాచ్ 12వ తేదీన జరుగుతుంది.

 

టీ20 సిరీస్ కోసం భారత్ జట్టు..
సూర్యకు మార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, హార్దిక్ పాండ్య, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, ఆర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.