ఆడమ్ గిల్‌క్రిస్ట్ చెప్పిన టాప్-3 వికెట్ కీపర్లు ఎవరో తెలుసా? ధోనీ గురించి ఏమన్నాడంటే

భారత్ జట్టుతో జరగబోయే బోర్డర్ -గవాస్కర్ సిరీస్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డారు. స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుదే ఆధిపత్యం ఉంటుందని అన్నాడు

Adam Gilchrist

Adam Gilchrist Top 3 Wicket Keepers : ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరు క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమే. ప్రస్తుతం అతను ఓ ఇంగ్లీష్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మీ దృష్టిలో బెస్ట్ వికెట్ కీపర్లు ఎవరు అని ప్రశ్నించగా.. ముగ్గురు పేర్లను ప్రస్తావించాడు. అతని అత్యుత్తమ వికెట్ కీపర్ల జాబితాలో ఎంఎస్ ధోనీ కూడా ఉన్నాడు. గిల్‌క్రిస్ట్ ధోని గురించి మాట్లాడుతూ.. ధోనీ ఎంత క్లిష్టపరిస్థితుల్లోనైనా చాలా ప్రశాంతంగా వికెట్ కీపింగ్ చేస్తాడు. అంతే స్థాయిలో బ్యాటింగ్ లోనూ రాణించగల సత్తా ఉంది. తనకు ఏ చిన్న అవకాశం వచ్చినా మ్యాచ్ ను తమవైపుకు తిప్పుకొనే సత్తా కలిగిన వ్యక్తి ధోనీ అంటూ ప్రసంశించాడు. అతని దృష్టిలో ప్రపంచ క్రికెట్ లో టాప్ -3 వికెట్ కీపర్ల జాబితాలో ధోనీకి రెండో స్థానాన్ని ఇచ్చాడు.

Also Read : MS Dhoni : రాంచీలోని దాబాలో స్నేహితులతో కలిసి సందడిచేసిన ఎంఎస్ ధోనీ.. ఫొటో వైరల్

ఆడమ్ గిల్‌క్రిస్ట్ దృష్టిలో ప్రపంచ నవంబర్ వన్ వికెట్ కీపర్ రోడ్నీ మార్ష్. అతని గురించి మాట్లాడుతూ.. మార్ష్ నాకు ఆదర్శం. నేను అతనిలా ఉండాలనుకున్నాను. మార్ష్ 1970 నుంచి 1984 మధ్య ఆస్ట్రేలియా తరపున 96 టెస్టులు ఆడాడు. గిల్‌క్రిస్ట్ జాబితాలో మూడో బెస్ట్ వికెట్ కీపర్ కుమార సంగక్కర. అతని గురించి గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. కుమార సంగక్కర టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసినా, వికెట్ కీపింగ్ అయినా ప్రతి విషయంలోనూ అత్యుత్తమంగా ఉంటాడని కొనియాడాడు.

Also Read : Jay Shah : ఐసీసీ ఛైర్మన్‌గా జైషా..! గ్రెగ్ బార్‌క్లే పదవి నుంచి తప్పుకోవటంతో లైన్ క్లియర్

అదేవిధంగా భారత్ జట్టుతో జరగబోయే బోర్డర్ -గవాస్కర్ సిరీస్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డారు. స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుదే ఆధిపత్యం ఉంటుంది. అయితే, విదేశాల్లో ఎలా గెలవాలో భారత్ జట్టుకు తెలుసు. సహజంగా నేను ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆశించినా.. ఇరు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంటుందని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది నవంబర్ 22 నుంచి భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ -గవాస్కర్ ట్రోపీ టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మొత్తం ఐదు మ్యాచ్ లు జరగనున్నాయి.

 

 

 

ట్రెండింగ్ వార్తలు