MS Dhoni : రాంచీలోని దాబాలో స్నేహితులతో కలిసి సందడిచేసిన ఎంఎస్ ధోనీ.. ఫొటో వైరల్
మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల తన స్వస్థలమైన రాంచీ, జార్ఖండ్ లో వీలుచిక్కినప్పుడల్లా అతని కుటుంబ సభ్యులు స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నారు.

MS Dhoni
MS Dhoni enjoying With Friends : ఐపీఎల్ 2025లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడతారా..? రిటైర్మెంట్ ప్రకటిస్తారా? ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 42ఏళ్ల ధోనీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. 2024లో సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్ కు జట్టు బాధ్యతలు అప్పగించారు. కేవలం వికెట్ కీపర్, బ్యాటర్ గానే ధోనీ బరిలోకి దిగాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్న ధోనీ.. 2025 సీజన్ నాటికి రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న చర్చ జరుగుతుంది. అయితే, 2025 ఐపీఎల్ లో ధోనీని సీఎస్కే జట్టు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Jay Shah : ఐసీసీ ఛైర్మన్‌గా జైషా..! గ్రెగ్ బార్‌క్లే పదవి నుంచి తప్పుకోవటంతో లైన్ క్లియర్
మరోవైపు టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ధోనీ తన వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్నాడు. ఇటీవల తన స్వస్థలమైన రాంచీ, జార్ఖండ్ లో వీలుచిక్కినప్పుడల్లా అతని కుటుంబ సభ్యులు స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నారు. గత ఆదివారం రాంచీలోని స్థానిక దాబాలో తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి ధోనీ లంచ్ చేశాడు. దాబా వద్ద ఓపెన్ ప్లేస్ లో పెద్ద డైనింగ్ టేబుల్ మీద స్నేహితులతో కలిసి ధోనీ భోజనం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో ధోనీ పట్ల ప్రేమను చాటుకుంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
MS Dhoni enjoying the Sunday with his close friends ❤️ pic.twitter.com/oVZEJMECGW
— Johns. (@CricCrazyJohns) August 19, 2024