Yuvraj Singh : ‘యువరాజ్ సింగ్’ బయోపిక్ అనౌన్స్.. T20 వరల్డ్ కప్‌లో యువీ కొట్టిన ఆరు సిక్స్‌లు గుర్తున్నాయా..?
ఇప్పటికే క్రికెట్ లో పలువురు బయోపిక్స్ రాగా ఇప్పుడు యువరాజ్ సింగ్ బయోపిక్ రానుంది.

Ex Team India cricketer Yuvraj Singh Biopic Announced in Bollywood under T Series Productions
Yuvraj Singh : ఇటీవల అనేకమంది ప్రముఖుల బయోపిక్ లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులలో అనేకమంది బయోపిక్స్ తెరకెక్కాయి. ఇప్పుడు మరో బయోపిక్ రానుంది. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుంది. ఇప్పటికే క్రికెట్ లో సచిన్, ధోని, మిథాలీరాజ్, అజారుద్దీన్, ప్రవీణ్ తంబే, జులన్ గోస్వామి.. ఇలా పలువురు బయోపిక్స్ రాగా ఇప్పుడు యువరాజ్ సింగ్ బయోపిక్ రానుంది.
ఇండియన్ క్రికెట్ లో సంచలనాలు సృష్టించిన క్రికెటర్స్ లో యువరాజ్ సింగ్ ఒకరు. తన ఆటతో టీమిండియాకు ఎన్నో సార్లు విజయాలు చేకూర్చాడు. మొదటి T20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ మీద కొట్టిన ఆరు సిక్స్ లు ఇప్పటికే ఏ ఇండియన్ క్రికెట్ అభిమాని మర్చిపోడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా తన అద్భుతమైన ఆటతో కప్ సాధించడానికి సహకరించాడు. అయితే యువరాజ్ క్యాన్సర్ కి గురవడం, అంతర్జాతీయ క్రికెట్ కి దూరమవ్వడం జరిగింది. కానీ క్రికెట్ లో గెలిచినట్టే క్యాన్సర్ తో కూడా పోరాడి గెలిచాడు.
Also Read : Kiran Abbavaram – Rahasya Gorak : చిరంజీవి పుట్టిన రోజున కిరణ్ అబ్బవరం పెళ్లి..? ఎక్కడో తెలుసా..?
తాజాగా నేడు యువరాజ్ సింగ్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు నేడు ప్రకటించారు. అయితే ఇందులో యువరాజ్ సింగ్ గా ఎవరు నటిస్తారు? ఎవరు దర్శకత్వం వహిస్తారు.. మిగిలిన డీటెయిల్స్ ఇంకా ప్రకటించలేదు. యువరాజ్ సింగ్ బయోపిక్ ప్రకటించడంతో అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక యువరాజ్ నేడు నిర్మాతలతో కలిసి దిగిన ఫోటో వైరల్ గా మారింది. ఈ సినిమాకు యువరాజ్ కూడా ఒక నిర్మాత అని సమాచారం. T20 వరల్డ్ కప్‌లో యువీ కొట్టిన ఆరు సిక్స్‌లను మెయిన్ పాయింట్ గా తీసుకొని దాని చుట్టూ ఈ బయోపిక్ కథ అల్లుతారని తెలుస్తుంది.
Relive the legend's journey from the pitch to the heart of millions—Yuvraj Singh's story of grit and glory is coming soon on the big screen! ?#SixSixes@yuvstrong12 @ravi0404#BhushanKumar #KrishanKumar @shivchanana @neerajkalyan_24 #200NotOutCinema @TSeries pic.twitter.com/53MsfVH476
— T-Series (@TSeries) August 20, 2024